Dailyhunt
TVK Vijay Resort Politcs: రిసార్ట్ రాజకీయాలు మొదలుపెట్టిన విజయ్! టీవీకే ఎమ్మెల్యేల్ని కాడుకునేందుకు ప్రయత్నాలు

TVK Vijay Resort Politcs: రిసార్ట్ రాజకీయాలు మొదలుపెట్టిన విజయ్! టీవీకే ఎమ్మెల్యేల్ని కాడుకునేందుకు ప్రయత్నాలు

ABP దేశం 1 week ago

మిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడగా హంగ్ వచ్చింది. ఏ పార్టీకి, కూటమికిగానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత సాధారణ మెజార్టీ కూడా రాలేదు. అయితే తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన టీవీకే అధినేత విజయ్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది.

రిసార్ట్ వేటలో టీవీకే?
తమిళనాడులో ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే అధినేత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు పార్టీ ఎమ్మెల్యేల్ని సురక్షితంగా ఉంచడానికి కూవత్తూరు తరహాలో ఒక రిసార్ట్ కోసం వెతుకుతున్నట్లు సమాచారం. ఎన్నికల్లో గెలిచిన వారు తన పనయూర్ నివాసానికి రావాలని ఓట్ల లెక్కింపునకు ఒక రోజు ముందే పార్టీ అభ్యర్థులను విజయ్ ఆదేశించారు. ఏ పార్టీకి, కూటమికి మెజార్టీ రాకపోవడంతో ఏ క్షణాన ఏమైనా జరగొచ్చు అని విజయ్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను ఇతర పార్టీలు ప్రలోభపెట్టడం, భయపెట్టడం, కిడ్నాప్ లాంటి డ్రామాలు లేకుండా చూడటంలో భాగంగా అందర్నీ రిసార్ట్‌కు తరలించాలని చూస్తున్నారని సమాచారం.

TVK (టీవీకే): 108 స్థానాల్లో విజయం సాధించారు. ఇందులో విజయ్ రెండు చోట్ల విజయం సాధించగా, ఒక స్థానానికి ఆయన రాజీనామా చేస్తే టీవీకేకు మొత్తం 107 స్థానాలు ఉంటాయి.

DMK (డీఎంకే): స్టాలిన్ కు చెందిన ఈ కూటమి మొత్తం 73 స్థానాల్లో విజయం సాధించింది. అందులో కాంగ్రెస్ 5 స్థానాల్లో గెలుపొందింది.

AIADMK (అన్నాడీఎంకే): మూడో స్థానానికి పరిమితమైన ఈ కూటమి 53 స్థానాల్లో నెగ్గింది. కూటమిలో ఉన్న పీఎంకే పార్టీ 4 చోట్ల విజయం సాధించింది.

ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్: 2 స్థానాల్లో విజయం.

CPI: 2 స్థానాల్లో విజయం.

VCK: 2 స్థానాల్లో విజయం.

CPM: 2 స్థానాల్లో విజయం.

BJP: 1 స్థానంలో విజయం.

DMDK: 1 స్థానంలో విజయం.

AMMK: 1 స్థానంలో విజయం.

పీఎంకే (4), ఐయూఎంఎల్ (2), సిపిఐ (2), విసికె (2), సిపిఎం (2) మద్దతు కనుక విజయ్‌కి లభిస్తే మరో 12 సీట్లు అవుతాయి. దాంతో కాంగ్రెస్, బీజేపీ మద్దతు లేకుండానే విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు.

Author : Shankar Dukanam

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam