Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Udayanidhi Trisha Offer: ఉదయనిధి ఆఫర్‌ను తిరస్కరించిన త్రిష.. విజయ్ కోసమే అంటూ ప్రచారం

Udayanidhi Trisha Offer: ఉదయనిధి ఆఫర్‌ను తిరస్కరించిన త్రిష.. విజయ్ కోసమే అంటూ ప్రచారం

ABP దేశం 1 month ago

Trisha Krishnan New Movie: తమిళనాడు రాజకీయాలు.. సినిమా ఇండస్ట్రీ.. ఎప్పుడూ కలిసే ప్రయాణిస్తుంటాయి. ఇప్పుడు ఈ తరం యాక్టర్ విజయ్ ఏకంగా సీఎం కావడంతో ఆయన చుట్టూ జరుగుతున్న ప్రతి విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది.

సీఎం విజయ్ పర్సనల్ లైఫ్లో నటి త్రిష ఉన్నారనే రూమర్స్ తీవ్రంగా ఉన్న వేళ.. ఇప్పుడు త్రిష గురించి వస్తున్న ఓ వార్త.. సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. విజయ్ రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ క్యాంప్ నుంచి త్రిషకు భారీ సినిమా ఆఫర్ వెళ్లిందట. అదీ ఏకంగా 12 కోట్ల రూపాయల రెమ్యునరేషన్తో. కానీ ఆ ఆఫర్ను త్రిష తిరస్కరించిందనే ప్రచారం ఇప్పుడు వైరల్ అవుతోంది.

త్రిషపై మీడియా అటెన్షన్:

విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రిజల్ట్స్ అనౌన్స్ అయిన టైమ్ నుంచి ప్రమాణ స్వీకారానికి వచ్చిన వరకూ... ఆ తర్వాత కూడా ఆమె ప్రతీ మూమెంట్ సోషల్ మీడియా బజ్ క్రియేట్ చేస్తోంది. విజయ్ భార్య సంగీత కూడా విజయ్కు ఓ నటితో సంబంధం ఉందని తమ విడాకుల పిటిషన్లో ప్రస్తావించడంతో అప్పటి వరకూ ఉన్న రూమర్స్కు బలపడ్డాయి. వాళ్లిద్దరి సాన్నిహిత్యంపై చాలా బాహాటంగానే చర్చిస్తున్నారు. దీనిని వాళ్లిద్దరూ ఎక్కడా ఖండించలేదు కూడా..! ఆ విషయం పక్కన పెడితే.. మరో వార్త తమిళ మీడియాను షేక్ చేసింది.

ఉదయనిధి ఆఫర్ను తిరస్కరించారా...?

ఉదయనిధి స్టాలిన్కు సంబంధించిన ఓ భారీ ప్రాజెక్ట్ కోసం త్రిషను సంప్రదించారట. రజనీకాంత్- కమలహాసన్ కాంబినేషన్లో నెల్సన్ డైరక్షన్లో RedGiant ఓ మూవీని నిర్మిస్తోంది. ఈ మూవీకోసమే త్రిషను సంప్రదించారు. ఈ సినిమాకు దాదాపు 12 కోట్ల రూపాయల పారితోషికం ఆఫర్ చేశారనే కథనాలు బయటకొచ్చాయి. తమిళ సినీ వర్గాల్లో ఇది ఇప్పుడు హాట్ డిస్కషన్గా మారింది.త్రిష ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో టాప్ రేంజ్లో ఉంది. వరుసగా పెద్ద హీరోల సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది. ఆమె మార్కెట్ కూడా భారీగా పెరిగింది. అందుకే 10 నుంచి 12 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోందనే ప్రచారం జరుగుతోంది.ఈ భారీ ఆఫర్పై త్రిష ఇంకా ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం “విజయ్కు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే త్రిష ఈ ప్రాజెక్ట్కు దూరంగా ఉంటోందా?” అన్న చర్చ మొదలైంది.
ఎందుకంటే ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో విజయ్ పార్టీ TVK, DMK మధ్య రాజకీయ పోరు తీవ్రంగా ఉంది. అలాంటి సమయంలో ఉదయనిధి స్టాలిన్ క్యాంప్కు దగ్గరగా ఉన్న ప్రాజెక్ట్లో త్రిష నటిస్తే అది రాజకీయంగా కూడా చర్చకు దారి తీసే అవకాశం ఉంది. ఇక సోషల్ మీడియాలో అయితే ఈ అంశంపై భారీ డిబేట్ నడుస్తోంది. కొందరు “త్రిష కెరీర్ కంటే విజయ్ రిలేషన్కే ప్రాధాన్యం ఇస్తోందా?” అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం “ఇది అంతా కేవలం గాసిప్ మాత్రమే.. త్రిష ప్రొఫెషనల్ యాక్ట్రెస్.. మంచి ప్రాజెక్ట్ అయితే తప్పకుండా చేస్తుంది” అంటున్నారు.

Author : ARYA

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam