Kalavari kodalu kanaka mahalakshmi serial upcoming episodes ప్రస్తుతం ఆసక్తికరంగా ఉన్న సీరియల్స్లో జీ తెలుగులో ప్రసారం అవుతున్న కలవారి కోడలు కనక మహాలక్ష్మీ ఒకటి.
మొదట్లో ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఈ సీరియల్ మధ్యలో సా..గ దీస్తూ రొటీన్ స్టోరీలా అయిపోయింది. అయితే ఇటీవల మంచి మంచి ట్విస్ట్లతో ఎంతో ఆసక్తికరంగా మారింది. యమున గతం.. లక్ష్మీ, విహారిల గురించి తెలిసి లక్ష్మీ తండ్రి ఆదికేశవులు ఇద్దరినీ విడదీయడానికి ప్రయత్నించడం.. పద్మాక్షి, యమునలకు లక్ష్మీ విహారి భార్య అని తెలియడం ఇలా రకరకాల ట్విస్ట్లతో రోజు రోజుకూ ఇంట్రస్టింగ్గా మారిపోయింది. ప్రస్తుతం ఊహించని విధంగా ప్రెగ్నెంట్గా ఉన్న లక్ష్మీ విహారికి శాశ్వతంగా దూరం అయిపోవడం.. విహారి తాగుబోతుగా మారిపోవడం.. సహస్ర దొంగ ప్రెగ్నెన్సీని నటిస్తుండటంతో కథ ఎటు మలుపు తిరుగుతుందా అని ఆసక్తి పెరిగింది..
పద్మాక్షి లక్ష్మీని చంపాలని ప్రయత్నించి యాక్సిడెంట్ చేయడం ఆ టైంలో ఆ ఆటోలో సహస్ర ఉండటం వల్ల సహస్రకు యాక్సిడెంట్ అయి గర్భసంచి కోల్పోవడంతో కథ స్పీడ్ అందుకుంది. సహస్రకు సరోగసి చేసి విహారి ఇంటికి వారసుడిని ఇవ్వాలని పద్మాక్షి, సహస్ర ప్లాన్ చేస్తారు. అందులో భాగంగా అనుకోకుండా లక్ష్మీ గర్భంలోకే సరోగసీ ప్రాసెస్ చేస్తారు. అయితే ఆ గర్భం నిలవదు. తర్వాత లక్ష్మీ,విహారి అడవిలో ఒకటైపోవడంతో లక్ష్మీ ప్రెగ్నెంట్ అవుతుంది. లక్ష్మీ ప్రెగ్నెంట్ అని విహారికి తెలియకముందే సహస్ర బ్లాక్మెయిల్తో లక్ష్మీ శాశ్వతంగా విహారికి దూరంగా వెళ్లిపోతుంది. ప్రస్తుతం ఎపిసోడ్స్లో లక్ష్మీ 5 నెలల గర్భవతి. ఇక సహస్ర కూడా 7 నెలల గర్భవతిగా నాటకం ఆడుతుంది.
రానున్న ఎపిసోడ్స్లో ఇదే జరుగుతుందా!!
లక్ష్మీ సిరిగా పేరు మార్చుకొని ఓ బామ్మ దగ్గర ఉంటుంది. సిరిగా బామ్మ దగ్గరే ఉంటూ అక్కడే పురుడు పోసుకొని ఓ మగ బిడ్డకు జన్మనివ్వొచ్చు. ఆ బాబుని చదివించుకోవడం కోసం.. బామ్మకి అండగా ఉండటానికి లక్ష్మీ మళ్లీ జాబ్ చేయొచ్చు. ఇక పద్మాక్షి కూడా సహస్రకు నెలలు నిండి డెలివరి టైంలో ఓ అనాథ బాబుని తీసుకొచ్చి ఇంటి వారసుడిగా చేయొచ్చు.. అందరూ విహారి బిడ్డే అని ఆ బిడ్డని లగ్జరీగా పెంచుతారు. సహస్ర బిడ్డను చదివించే స్కూల్లోనే లక్ష్మీ తన కొడుకుని కూడా చదివించడం.. విహారి సహస్ర బిడ్డను డ్రాప్ అండ్ పింక్ చేసుకోవడానికి వెళ్తూ లక్ష్మీ బిడ్డను చూసి ఆ బాబు ప్రవర్తన అచ్చం తనలా ఉందని అనుకోవడం జరగొచ్చు. విహారి సహస్ర బిడ్డతో కంటే ఆ లక్ష్మీ కొడుకుతో ఫ్రెండ్షిప్ చేసుకోని ఇద్దరిని విధి కలిపినట్లు.. ఇద్దరూ క్లోజ్గా తిరగడం లక్ష్మీ అది చూసి సంతోషపడటం జరగొచ్చు.. విహారి తన సొంత కొడుకుతో ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం సహస్ర, పద్మాక్షిలు చూసి ఎంక్వైరీ చేసి ఆ బిడ్డ లక్ష్మీ కొడుకు అని తెలుసుకొని వాళ్లని చంపాలని చూడటం.. లేదంటే విహారికి దూరం చేయాలి అని చూడటం జరుగుతుందని అనిపిస్తుంది.
అందుకే ఆ సీరియల్ ఆపేశారా..!
ఇదే స్టోరీ లైన్తో చాలా సీరియల్స్నే వచ్చాయి. మా టీవీలో ప్రసారం అయి అర్ధాంతరంగా ఆగిపోయిన నువ్వుంటే నా జతగా సీరియల్ కూడా ఇలాంటి స్లోరీ వల్లే ఆగిపోయిందని తెలుస్తుంది. ఆ సీరియల్ హీరో అర్జున్ కల్యాణ్ సీరియల్ ఆగిపోయిన తర్వాత ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ ఎంతో అన్యోన్యంగా ఉన్న దేవా, మిథున అనుకోని కారణాలు వల్ల విడిపోతారని.. దేవా రౌడీయిజం మానేశాడని అనుకున్న మిథున దేవా మళ్లీ రౌడీయిజం చేయడంతో నువ్వు ఈ జన్మలో మారవు అని చెప్పి దేవాని శాశ్వతంగా వదిలేసి వెళ్లిపోవడం.. మిథున దేవాని వదిలేసి వెళ్లినప్పటికి మిథున గర్భవతి అవ్వడం.. ఐదేళ్ల తర్వాత దేవా తన కూతుర్ని కలవడం ఇలా స్టోరీని అనుకున్నారంట.. ఈ కథకి మిథున క్యారెక్టర్ చేసిన నటి నో చెప్పేయడంతో ఆ స్థానంలో ఎన్నెన్నె జన్మల బంధం.. సత్యభామ సీరియల్స్ల ఫేమ్ దేబ్జానీని అనుకున్నారంట. కానీ అనుకోనిరీతిలో ఆ సీరియల్కి మధ్యలోనే ముగింపు పలికేశారు.
Author : Jhanshi Balleda

