Upcoming OTT Releases Telugu June 2026: థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే ప్రేక్షకులు ఎంత మంది ఉన్నారో... అంతకు మించి ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీస్లు చూసే వీక్షకులు ఉన్నారు.
ఓటీటీ లవర్స్కు జూన్ 2026లో బోలెడు ఆప్షన్స్ ఉన్నాయి. ఏయే సినిమాలు, వెబ్ సిరీస్లు వస్తున్నాయో చూడండి.
జూన్ 4న హాట్స్టార్లో 'ధురంధర్ 2' రిలీజ్
Dhurandhar The Revenge OTT Release Date: జూన్ 4వ తేదీ నుంచి జియో హాట్స్టార్ ఓటీటీలో 'ధురంధర్: ది రివెంజ్' స్ట్రీమింగ్ కానుంది. రణవీర్ సింగ్ హీరోగా... అర్జున్ రాంపాల్, మాధవన్, సంజయ్ దత్, సారా అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ బరిలో ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. విమర్శకులతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రమిది. ఓటీటీలో ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
ప్రైమ్ వీడియోలో 'మేడ్ ఇన్ ఇండియా' సిరీస్
Made in India: A Titan Story Streaming Date: జూన్ 3 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సిరీస్ 'మేడ్ ఇన్ ఇండియా: ఎ టైటాన్ స్టోరీ'. ఇందులో నసీరుద్దీన్ షా, జిమ్ సర్బ్ ప్రధాన పాత్రల్లో నటించారు. టైటాన్ వాచ్ కంపెనీ నేపథ్యంలో తెరకెక్కిన సిరీస్ ఇది. జెర్క్సెస్ దేశాయ్, జేఆర్డీ టాటాల జీవితాల స్ఫూర్తితో తెరకెక్కించారు.
నెట్ఫ్లిక్స్లో మాధురి దీక్షిత్ 'మా బెహన్'
Maa Behen Streaming Date: మాధురీ దీక్షిత్, తృప్తి డిమ్రి, ధరణా దుర్గ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'మా బెహన్'. డార్క్ క్రైమ్ కామెడీగా తెరకెక్కిన థ్రిల్లర్ చిత్రమిది. జూన్ 4వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో ప్రీమియర్ కానుంది. సాధారణ మధ్యతరగతి తల్లి, కుమార్తెలు తమ ఇంట్లోని శవం ఉన్నట్టు ఇరుగు పొరుగు జనాలకు తెలియకుండా ఎలా దాచారు? అనేది సినిమా.
జీ5లో మమ్ముట్టి 'పేట్రియాట్' స్ట్రీమింగ్
Patriot OTT Release Date: మమ్ముట్టి హీరోగా నటించిన యాక్షన్ అండ్ స్పై ఫిల్మ్ 'పేట్రియాట్'. ఇందులో మోహన్ లాల్ ప్రత్యేక పాత్ర చేశారు. ఫహద్ ఫాజిల్ విలన్ రోల్ చేయగా... నయనతార, కుంచకో బోబన్, దర్శనా రాజేంద్రన్ ఇతర పాత్రల్లో నటించారు. జూన్ 5 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందీ సినిమా. 'పేట్రియాట్' రివ్యూస్ బావున్నాయి. దాంతో ఇతర భాషల్లోనూ సినిమాపై ఆసక్తి నెలకొంది.
జూన్ 5న ధృవ సర్జా 'కేడీ ది డెవిల్' కూడా
KD The Devil OTT Release Date: జూన్ 5న ఓటీటీలోకి వస్తున్న మరొక సినిమా 'కేడీ ది డెవిల్'. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా మేనల్లుడు, కన్నడ యాక్షన్ స్టార్ ధ్రువ సర్జా హీరోగా నటించిన చిత్రమిది. ఇందులో సంజయ్ దత్ డాన్ రోల్ చేశారు. ఈ సినిమా విడుదలకు ముందు విమర్శలు చుట్టుముట్టాయి. ఐటమ్ సాంగ్ 'సర్కే చునార్' లిరిక్స్ మీద జనాలు మండిపడ్డారు. దాంతో లిరిక్స్ ఛేంజ్ చేశారు. కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో జీ5 ఓటీటీలో జూన్ 5 నుంచి 'కేడీ ది డెవిల్' సినిమా స్ట్రీమింగ్ కానుంది.
- జూన్ 5 నుంచి సోనీలివ్ ఓటీటీలో 'గుల్లక్' వెబ్ సిరీస్ సీజన్ 5 స్ట్రీమింగ్ కానుంది.
- జీ5 ఓటీటీలో జూన్ 5 నుంచి కరిష్మా కపూర్, సూర్య శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన 'బ్రౌన్' స్ట్రీమింగ్ కానుంది.
జూన్ 12 నుంచి 'భూత్ బంగ్లా' స్ట్రీమింగ్
Bhooth Bangla OTT Release Date: జూన్ 12వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అక్షయ్ కుమార్, పరేష్ రావల్, రాజ్పాల్ యాదవ్, టబు ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ కామెడీ 'భూత్ బంగ్లా' స్ట్రీమింగ్ కానుంది. తమ పూర్వీకుల భవనంలో వివాహం జరిపించాలని ప్రయత్నించిన ఓ వ్యక్తికి అక్కడ ఎదురయ్యే వింత అనుభవాలు, ఆ బంగ్లా రహస్యాలే సినిమా కథ.
జూన్ 19న 'తుక్రా కే మేరా ప్యార్ సీజన్ 2'
Thukra Ke Mera Pyaar Season 2 Streaming Date: జూన్ 19న జియో హాట్స్టార్ ఓటీటీలో 'తుక్రా కే మేరా ప్యార్ సీజన్ 2' స్ట్రీమింగ్ కానుంది. ఇందులో సంచిత బసు, ధవల్ ఠాకూర్ ప్రధాన తారాగణం. ప్రేమ, మోసం, రాజకీయ ప్రతీకారం నేపథ్యంలో సాగే కథతో అధికారం కోసం జరిగే పోరాటమే సిరీస్ కథ.
జూన్ 24 నుంచి 'అవతార్: ఫైర్ అండ్ యాష్'
Avatar Fire and Ash Streaming Date: ప్రపంచ సినిమా ప్రేమికులకు 'అవతార్' ఫ్రాంచైజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జూన్ 24 నుంచి జియో హాట్స్టార్ ఓటీటీలో 'అవతార్: ఫైర్ అండ్ యాష్' స్ట్రీమింగ్ కానుంది. జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 'అవతార్' సిరీస్లో మూడవది.
జూన్ 26న నెట్ఫ్లిక్స్లో 'రాజా శివాజీ' రిలీజ్
Raja Shivaji OTT Release Date: జూన్ 26న నెట్ఫ్లిక్స్ ఓటీటీలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కథతో తెరకెక్కిన 'రాజా శివాజీ' స్ట్రీమింగ్ కానుంది. రితీష్ దేశ్ముఖ్, జెనీలియా, సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. స్వరాజ్య స్థాపన కోసం ఛత్రపతి శివాజీ మహారాజ్ చేసిన పోరాటాలే చిత్రకథ.
- జియో హాట్స్టార్ ఓటీటీలో జూన్ 25 నుంచి 'ది బేర్' సీజన్ 5 స్ట్రీమింగ్ కానుంది.
- జూన్ 5న ఆపిల్ టీవీలో 'కేప్ ఫియర్' విడుదల అవుతోంది.
- జూన్ 5న నెట్ఫ్లిక్స్లో 'ఆఫీస్ రొమాన్స్' విడుదల కానుంది.
- జూన్ 22న జియో హాట్స్టార్లో 'హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 3' విడుదల.
Also Read: Ravi Mohan Vs Kushboo - 'జయం' రవి కాపురంలో చిచ్చు పెట్టిందెవరు? ఖుష్బూ భుజాలు తడుముకోవడం ఎందుకు?
Author : Satya Pulagam

