Urfi Javed Visits Kamakhya Temple Photos: ఉర్ఫీ జావేద్... బాలీవుడ్ సెలబ్రిటీల గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. డిఫరెంట్ డిఫరెంట్ డ్రస్ లతో వైరల్ అవుతుంటారు.
జన్మతః ఆమె ముస్లిం. అయితే తనకు దేవుళ్ళ మీద నమ్మకం లేదని కొన్ని రోజుల క్రితం చెప్పారు. తాను నాస్తికురాలిని అని చెప్పారు. ఇప్పుడు ఆమె హిందూ ఆలయానికి వెళ్ళడం చర్చనీయాంశం అయ్యింది. (Image Courtesy: urf7i / Instagram)
గ్రీన్ కలర్ కుర్తా, తలపై పింక్ దుపట్టా ధరించి అస్సాంలోని గువహటిలో ఉన్న కామాఖ్యా దేవి ఆలయానికి ఉర్ఫీ జావేద్ వెళ్లారు. (Image Courtesy: urf7i / Instagram)
కామాఖ్యా దేవి ఆలయానికి ఉర్ఫీ జావేద్ వెళ్ళడంతో ఆమె హిందూ మతంలోకి మారిందని... తన పేరును రీటా భరద్వాజ్ లేదా గీతా భరద్వాజ్‌గా మార్చుకుందని వార్తలను వచ్చారు. వాటిని ఆమె తీవ్రంగా ఖండించారు. (Image Courtesy: urf7i / Instagram)
తాను ఏ మతాన్ని నమ్మనని, తాను నాస్తికురాలినని ఉర్ఫీ జావేద్ స్పష్టం చేశారు. "నేను ఎప్పుడో మతాన్ని వదిలేశాను... నేను ఏ మతంలోనూ లేను. నన్ను బయటకు ఎలా పంపుతారు?" అని ఉర్ఫీ జావేద్ ప్రశ్నించారు.(Image Courtesy: urf7i / Instagram)
తాను నాస్తికురాలిని అని ఉర్ఫీ జావేద్ ప్రకటించిన కొద్ది రోజులకే ఆమె కామాఖ్యా దేవి ఆలయానికి వెళ్ళడం చర్చకు దారి తీసింది. (Image Courtesy: urf7i / Instagram)

