Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Vaibhav Sooryavanshi News: సూర్యవంశీ ఫ్యూచర్ పై బీసీసీఐ బాస్ కీలక అప్డేట్.. యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిన కార్యదర్శి సైకియా

Vaibhav Sooryavanshi News: సూర్యవంశీ ఫ్యూచర్ పై బీసీసీఐ బాస్ కీలక అప్డేట్.. యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిన కార్యదర్శి సైకియా

ABP దేశం 2 weeks ago

IPL 2026 RCB VS GT Finals Update: ఐపీఎల్ 2026 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. గుజరాత్ టైటాన్స్ (GT) తో జరిగిన ఫైనల్ ఫైట్ లో రజత్ పాటిదార్ కెప్టెన్సీలోని ఆర్సీబీ ఐదు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టి వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది.

ఈ సంచలన విజయంపై బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా, బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఆర్సీబీ జట్లను అభినందించారు. ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడి 776 రన్స్ తో ఆరెంజ్ క్యాప్ గెలిచిన 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ పర్ఫార్మెన్స్ ను సైకియా స్పెషల్ గా మెచ్చుకున్నాడు. కేవలం 15 ఏళ్ల 65 రోజుల ఏజ్ లోనే ఆరెంజ్ క్యాప్ సాధించి అతడు సరికొత్త రికార్డ్ సెట్ చేశాడు.

గుజరాత్ పై ఆర్సీబీ కంప్లీట్ డామినేషన్

ఈ ఫైనల్ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ టీమ్ ఆర్సీబీ బౌలర్ల దాటికి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 రన్స్ మాత్రమే చేయగలిగింది. వాషింగ్టన్ సుందర్ (50), నిశాంత్ సింధు (20) మాత్రమే రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో రసిఖ్ సలామ్ 3 వికెట్లు, భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు తీశారు. ఆ తర్వాత 156 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన బెంగళూరు టీమ్ కు వెంకటేష్ అయ్యర్ (32), విరాట్ కోహ్లీ మంచి స్టార్ట్ ఇచ్చారు. మిడిల్ ఆర్డర్ లో గుజరాత్ బౌలర్లు పుంజుకుని ఆర్సీబీని 132 రన్స్ కే 5 వికెట్లు పడగొట్టి ప్రెజర్ లోకి నెట్టినా, విరాట్ కోహ్లీ (42 బంతుల్లో 75 నాటౌట్, 9 ఫోర్లు, 3 సిక్సర్లు) క్లాస్ ఇన్నింగ్స్ తో మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే టీమ్ ను గెలిపించాడు.

Read Also: RCB IPL victory 2026: ఆర్సీబీ 'రాయల్' విక్టరీతో కొత్త బాసులకు కాసుల పంట! అమాంతం పెరిగిన బ్రాండ్ వాల్యూ!

సూర్యవంశీని హయ్యెస్ట్ లెవెల్ కు తీసుకెళ్తామని సైకియా హామీ

మ్యాచ్ ముగిసిన అనంతరం బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా మీడియాతో మాట్లాడుతూ ఈ సీజన్ చాలా వండర్ ఫుల్ గా సాగిందని చెప్పారు. వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన ఆర్సీబీకి కంగ్రాట్స్ తెలిపారు. 15 ఏళ్ల బీహార్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ప్లేయర్ అని, అతడికి బ్రైట్ ఫ్యూచర్ ఉందని కొనియాడారు. అతడిని క్రికెట్ లో హయ్యెస్ట్ లెవెల్ కు తీసుకెళ్లడానికి బీసీసీఐ నుంచి పూర్తి సపోర్ట్ ఇస్తానని స్పష్టం చేశారు. అలాగే ఈ నెలలో జరగబోయే ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ గురించి మాట్లాడుతూ, మహిళల టీమ్ గత ఏడాది వన్డే టైటిల్ గెలిచినట్టే ఈసారి కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ రిపీట్ చేస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

Read Also: Gujarat Titans Bus Caught on Fire: ఐపీఎల్ ఫైనల్ తరువాత జీటీ బస్సులో మంటలు.. ప్లేయర్లకు తప్పిన ప్రమాదం, గంటసేపు రోడ్డుపైనే..

బెంగళూరు ఖాతాలో నాలుగో మేజర్ ట్రోఫీ

బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ కూడా ఆర్సీబీ టీమ్ ను అభినందిస్తూ ఇదొక గ్రేట్ విక్టరీ అని చెప్పారు. మ్యాచ్ అహ్మదాబాద్ లో జరిగినా బెంగళూరు ఫ్యాన్స్ భారీ సంఖ్యలో వచ్చి సపోర్ట్ చేశారని గుర్తు చేశారు. ఐపీఎల్ ప్రపంచంలోనే బిగ్గెస్ట్ లీగ్ అని, దీనిని సక్సెస్ ఫుల్ గా నిర్వహించడం బీసీసీఐ సాధించిన పెద్ద అచీవ్ మెంట్ అని ప్రశంసించారు. ఈ గెలుపుతో ఆర్సీబీ టీమ్ మెన్ ఐపీఎల్ లో రెండు టైటిల్స్ సాధించగా, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) లో ఆర్సీబీ ఉమెన్స్ టీమ్ గెలిచిన రెండు టైటిల్స్ తో కలిపి ఓవరాల్ గా ఈ ఫ్రాంచైజీ ఖాతాలో నాలుగు మేజర్ ట్రోఫీలు చేరాయి.

Author : Ayesha

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam