Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Vaibhav Suryavanshi: చిచ్చర పిడుగు సూర్యవంశీ రికార్డు.. 25 బంతుల్లోనే సెంచరీ!

Vaibhav Suryavanshi: చిచ్చర పిడుగు సూర్యవంశీ రికార్డు.. 25 బంతుల్లోనే సెంచరీ!

ABP దేశం 1 month ago

Vaibhav Record Score: వైభవ్ సెంచరీ మిస్ అయినందుకు క్రికెట్ అభిమానులు చాలా బాధపడ్డాడరు. క్రిస్ గేల్ పేరిట 13 ఏళ్లుగా ఉన్న ఫాస్టెస్ట్ ఐపీఎల్ సెంచరీ రికార్డ్ బద్ధలు కాబోతుందనుకున్నారు.

సూచనలు కూడా అలాగే కనిపించాయి. ౩౦ బంతుల్లో క్రిస్ గేల్ సెంచరీ చేయగా.. 29 బంతుల్లోనే ఆ ఫీట్ను అధిగమించే ప్రయత్నం వైభవ్ చేశాడు. కానీ బ్యాడ్లక్.. 29 వ బంతిలో అవుట్ అయ్యాడు. అయితే అంతకు 2-3 రోజులు ముందు వైభవ్ 25 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. ఆటగాళ్ల సామర్థ్యాన్ని పరీక్షించడం కోసం ఇంగ్లండ్ వెటరన్ కెవిన్ పీటర్సన్ తన డిజిటల్ చానల్ The Switch ద్వారా నిర్వహించే పోటీలో వైభవ్ ఈ ఫీట్ సాధించాడు.

The Switchలో వైభవ్...
క్రికెట్ మైదానంలో ప్రతిభను కొలవడానికి గణాంకాలు సరిపోవు, కొన్నిసార్లు ఆటగాడిలోని అసలైన తెగింపును పరీక్షించడానికి ఒక అసాధారణ వేదిక కావాలి. ఇంగ్లాండ్ దిగ్గజం కెవిన్ పీటర్సన్ తన 'ది స్విచ్' (The Switch) వేదికగా 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అలాంటి ఒక సవాలునే విసిరారు. గంటకు 51 మైళ్ల వేగంతో మొదలై, ప్రతి బంతికీ ఒక మైలు వేగం పెరుగుతూ, చివరికి గంటకు 100 మైళ్ల (161 kmph) అత్యున్నత వేగాన్ని చేరుకునే బౌలింగ్ మెషీన్ను ఎదుర్కోవడం అంటే అది కేవలం బ్యాటింగ్ కాదు, అది ఒక 'అగ్నిపరీక్ష'. వేగం ట్రిపుల్ డిజిట్స్ను చేరుకుంటున్న కొద్దీ గాలిలో మార్పును, పిచ్పై బంతి విరుచుకుపడే తీవ్రతను తట్టుకుని నిలబడటం సామాన్యమైన విషయం కాదు.

  • ఇందులో కేవలం 50 బంతుల్లో 100 పరుగులు సాధించాలి.
  • 51 mph నుండి ప్రారంభమై, ప్రతి బంతికీ వేగం పెరుగుతూ 100 mph వరకు వెళ్తుంది.
  • ఒకవేళ బ్యాటర్ అవుట్ అయితే, మొత్తం స్కోరు నుండి 5 పరుగులు తగ్గిపోతాయి.
  • వైభవ్ ఇచ్చే క్యాచ్ను ఎవరైనా పట్టుకుంటే, పీటర్సన్ వారికి 1,000 డాలర్ల నగదు బహుమతిని ప్రకటించి ఫీల్డర్లలో మరింత ఉత్సాహాన్ని నింపారు. ;ఇలాంటి ఒత్తిడితో కూడిన సిచ్యువేషన్లో కూడా వైభవ్ చాలా కూల్గా తన టార్గెట్ను ఫినిష్ చేశాడు.

మెషిన్ అయినా మనిషైనా వైభవ్కు ఒక్కటే

IPLలో దాదాపు 250కి పైగా స్ట్రైక్ రేట్తో వైభవ్ ఏ విధంగా విరుచుకుపడుతున్నాడో మనం చూశాం. కానీ కెవిన్ పీటర్సన్ గ్రౌండ్లో.. బౌలింగ్ వేసేది మనిషి కాదు.. మెషిన్. అయితే మనిషైనా మెషినైనా తనకు ఒకటే అని వైభవ్ ప్రూవ్ చేశాడు. 50 బంతుల్లో వంద పరుగులు పూర్తి చేయాలని టార్గెట్ పెడితే.. వైభవ్ 25 బంతుల్లోనే దానిని కంప్లీట్ చేశాడు. మొదటి రెండు బంతులను సిక్సర్గా మలిచిన వైభవ్ ఆ తర్వాత 10 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు. అంటే దాదాపు అన్నీ సిక్సర్లే.. 18 బంతులు ఎదుర్కొనే సమయానికి 84 పరుగులు పూర్తి చేశాడు. ఇందులో 12 సిక్సర్లు ఉన్నాయి. అంటే మొత్తం మీద 25 బంతుల్లో 100 పూర్తి చేశాడు. అంటే స్ట్రైక్ రేట్ 400. అయితే ఇదే గ్రౌండ్లో కొన్నాళ్ల క్రితం శ్రేయస్ అయ్యర్ 22 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు

T20లో డబుల్ సెంచరీ కొడతా..

క్రిస్ గేల్ రికార్డును తాను కొట్టి చూపిస్తానని వైభవ్ అంటున్నాడు. మ్యాచ్ మధ్యలో పీటర్సన్ వైభవ్తో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ సందర్భంగా నీ గోల్ ఏంటని ప్రశ్నిస్తే.. క్రిస్గేల్ ఫాస్టెస్ట్ సెంచరీని పూర్తి చేయాలని చెప్పాడు. అయితే ఈ వీడియో రిలీజ్ అయిన రెండు రోజుల తర్వాత SRH మ్యాచ్ జరిగింది. అన్నట్లుగానే ఆల్మోస్ట్ ఆ రికార్జును దాటే ప్రయత్నం చేశాడు. అంతే కాదు. T20లో డబుల్ సెంచరీ చేయాలన్నది తన డ్రీమ్ అని చెప్పాడు.తాను కనుక 20 ఓవర్లు నిలబడగలిగితే ఆ పని చేస్తా కాన్ఫిడెన్స్గా చెప్పాడు. నిజంగా వైభవ్ 20 ఓవర్లు కనుక ఉంటే ఆ పని పెద్ద కష్టం కాదు కూడా ఎందుకంటే.. 10-12 ఓవర్లు పూర్తయ్యే సరికే వైభవ్ 90ల్లోకి వచ్చేస్తున్నాడు.

వైభవ్ ఓ మెజీషియన్.. అతని గుండె చాలా కూల్.. !

వైభవ్లోని అసాధారణ ప్రతిభను చూసిన పీటర్సన్.. వైభవ్ను మెజీషియన్ అని పొగిడాడు. అభివర్ణించాడు. రాబోయే "గ్లోబల్ స్టార్" అని అభివర్ణించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ సవాలు సమయంలో వైభవ్ ధరించిన 'హార్ట్ రేట్ మానిటర్' అతని ప్రశాంతతను ప్రతిబింబించింది. 90-100 మైళ్ల వేగంతో బంతులు దూసుకొస్తున్నా, అతని గుండె వేగం నియంత్రణలో ఉండటం అతని మానసిక దృఢత్వానికి నిదర్శనం.

Universal Baby Boss

అంతర్జాతీయ క్రికెట్ లో విధ్వంసకర ఆటగాడు.. క్రిస్గేల్ను మనం యూనివర్సల్ బాస్ అని పిలుస్తున్నాం. ఎందుకంటే బ్యాటింగ్లో అతను ధాటి అలాంటిది. అప్పట్లో ఎవరికీ సాధ్యం కానీ స్కోర్లు... స్ట్రైక్రేట్తో గేల్ విధ్వంసం చేశాడు. క్రికెట్ లోకం.. గేల్ను Universal Boss అని కీర్తించింది. ఇప్పుడు ఈ టీనేజ్ సంచలనం వైభవ్ను అలాగే పిలుస్తున్నారు. మొన్న SRHతో మ్యాచ్ లో బుడ్డోడి విశ్వరూపాన్ని చూసిన తర్వాత.. తనకు Universal Baby Boss అనే ట్యాగ్ను ఇచ్చేశారు.

Author : ARYA

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam