Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Varanasi: కాశీలో మరణం మోక్షం ఎందుకు? మరణించిన వ్యక్తి చెవిలో శివుడు చెప్పే ఆ మంత్రం రహస్యం ఏంటి?

Varanasi: కాశీలో మరణం మోక్షం ఎందుకు? మరణించిన వ్యక్తి చెవిలో శివుడు చెప్పే ఆ మంత్రం రహస్యం ఏంటి?

ABP దేశం 3 months ago

Moksha Taraka Mantram : కాశీ విశ్వనాథ ఆలయం..ఉత్తరప్రదేశ్ వారణాసిలో గంగానది ఒడ్డున ఉంది. హిందువులకు అత్యంత పవిత్రమైన 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి.

కాశీ విశ్వనాథుడి దర్శనం వల్ల మోక్షం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. అసలు కాశీని మోక్ష ద్వారం అని ఎందుకు పిలుస్తారు? మీరు ఎప్పుడైనా కాశీ వెళ్లినప్పుడు "కశ్యం మరణం ముక్తి" అనే మాట విన్నారా? మరి ఆ మాటకు అర్థం తెలుసా? "కాశీలో మరణం మోక్షానికి దారి తీస్తుంది."

వారణాసి లేదా బనారస్ అని పిలిచే కాశీ ప్రపంచంలో అత్యంత పురాతనమైన చైతన్యవంతమైన నగరం. వాస్తవానికి భూమ్మీద మొదటి నగరం కాశీ అని... భూమి కన్నా ముందే పుట్టింది వారణాసి అని కాశీ ఖంఢంలో ఉంది. వారణాసిలో మరణం జనన మరణ చక్రం నుంచి విముక్తినిస్తుందని కాశీ ఖండంలో ఉంది.

తారక మంత్రం ద్వారా మోక్ష ప్రాప్తి

వారణాసి నగరాన్ని సాక్షాత్తు శివుడే సృష్టించాడని నమ్ముతారు. బ్రహ్మ దేవుడు సృష్టి ప్రారంభించేందుకు ఓ ప్రదేశం కోసం చూస్తున్న సమయంలో .. భూమి మొత్తం నీరు నిండడంతో..తన త్రిశూలంతో కొంత భాగాన్ని పైకెత్తి అక్కడ కూర్చోమని చెప్పాడట శివుడు. అదే వారణాసి. అలా భూమి కన్నా ముందే కాశీ నగరం పుట్టిందని ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఉంది.

కాశీలో మరణించాలని చాలామంది అనుకుంటారు. ఇక్కడ మరణం అంటే భయం కాదు మోక్షం అని భావిస్తారు. ఇక్కడ హిందువులు ఎవరైనా మరణిస్తే దహన సంస్కారాల కోసం మణికర్ణిక ఘాట్కు తీసుకువెళతారు. ఆ క్షణం సాక్షాత్తూ శివుడే వారిని సమీపించి..చెవిలో తారక మంత్రాన్ని పఠిస్తాడట. అప్పుడే ఆ ఆత్మ మరో దేహాన్ని వెతుక్కోకుండా మోక్షం పొందుతుందనినమ్ముతారు. శివుడు చెప్పే తారక మంత్రం ఆత్మకు భౌతిక ప్రంపంచంలో బంధాన్ని తెంచేసి తక్షణ మోక్షాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు. ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం యముడు మృత్యుదేవత అయితే..కాశీలో మాత్రం పాప పుణ్యాలతో సంబంధం లేకుండా శివుడే మోక్షాన్ని ప్రసాదిస్తాడని భక్తుల విశ్వాసం.

ఈ శక్తి లేకుండా వారణాసి అసంపూర్ణం! ఈ తొమ్మిది రోజుల్లో కాశీ క్షేత్రం మరింత శక్తివంతంగా మారుతుందని మీకు తెలుసా?

ఎనిమిది అక్షరాల 'ఓం నమో నారాయణాయ', ఐదు అక్షరాల 'నమః శివాయ' అనే రెండు మంత్రాలతో కూడి తారక మంత్రం ఉంటుంది. పౌరాణిక సంప్రదాయాల ప్రకారం, శివుడు మొట్టమొదట పార్వతీ దేవికి తారక మంత్రాన్ని చెప్పాడు. తారక మంత్రాన్ని జపిస్తే విష్ణు సహస్రనామాన్ని జపించడం వల్ల కలిగే ప్రయోజనాలే కలుగుతాయని కూడా నమ్ముతారు. తాత్విక దృక్కోణం నుంచి ఇది హిందూమతం మూల భావనలను ప్రతిబింబిస్తుంది. తారక మంత్రం పరమశివుని సర్వోన్నత మార్గదర్శకత్వంలో భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక విముక్తికి ప్రతీక.

వారణాసి పంచక్రోశి యాత్రలో దాగిన రహస్యం, పది తలల కాళీమాత భీమ్చండీ ఆలయం! కాశీ వెళ్లేవారు అస్సలు మిస్సవొద్దు!

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

Author : RAMA

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam