Priyanka Chopra Shares Shooting Update Of Mahesh babu Varanasi : సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో రాబోతోన్న పాన్ వరల్డ్ అడ్వెంచర్ వారణాసి.
ఫస్ట్ గ్లింప్స్తోనే హాలీవుడ్ రేంజ్ హైప్ క్రియేట్ చేశారు రాజమౌళి. గ్లోబ్ ట్రాటర్ జానర్ మూవీ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా క్షణాల్లోనే వైరల్ అవుతోంది. తాజాగా ఈ ప్రాజెక్ట్ షూటింగ్ అప్డేట్ ఇచ్చారు ప్రియాంక చోప్రా.
హైదరాబాద్లో షూటింగ్
'వారణాసి' షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సెట్లో జరగనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ చేరుకున్న ప్రియాంక చోప్రా షూటింగ్లో పాల్గొనేందుకు వెళ్లారు. జర్నీ టైంలో కారులోనే ఫేసమ్ మాస్క్ వేసుకుంటూ షూట్కు రెడీ అవుతూ సెల్ఫీ వీడియోను ఇన్ స్టాలో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది.
ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ఒరిస్సా, కెన్యా, వారణాసితో పాటు సౌతాఫ్రికా, జార్జీయా వంటి దేశాల్లో డిఫరెంట్ లొకేషన్స్లో చేశారు. తాజాగా, హైదరాబాద్లో షెడ్యూల్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ పూర్తి కాగా... త్వరలోనే అంటార్కిటికాలో షెడ్యూల్ జరగనుందని ఇన్ సైడ్ వర్గాల టాక్. భారీ యాక్షన్ సీక్వెన్స్ మంచు కొండల్లో ప్లాన్ చేస్తుండగా... ఈ ఫైట్ మూవీకే స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుందని చెబుతున్నారు.
Also Read : పూల్లో మొసలి... లవర్స్కు బిగ్ షాక్ - ఓటీటీలోకి రొమాంటిక్ సర్వైవల్ థ్రిల్లర్ 'తు యా మై'
హైదరాబాద్లో భారీ సెట్స్
ఈ మూవీలో ప్రాచీన వారణాసి నగర పుట్టుక నుంచి రామాయణం ముఖ్య ఘట్టం వరకూ అన్నింటినీ చూపించారు. గ్లోబ్ ట్రాటర్గా మహేశ్ బాబు నటిస్తున్నారు. ఆయన రుద్రుడిగా శ్రీరాముడిగానూ కనిపించనున్నారు. గ్లోబ్ ట్రాటర్ అంటే ప్రపంచ అన్వేషకుడు. మహేశ్ చేయబోయే అడ్వెంచర్ జర్నీ కోసం వివిధ దేశాల్లో ఇప్పటికే షూటింగ్ పూర్తి చేశారు. లాస్ట్ షెడ్యూల్ జార్జియాలో కంప్లీట్ అయ్యింది. రీసెంట్గా వారణాసి సెట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ కథలో కాశీ నగరానికి, సనాతన హిందూ సంప్రదాయాలకు పెద్ద పీట వేసినట్లు టైటిల్ టీజర్ను బట్టి అర్థమవుతోంది. అందుకు అనుగుణంగా అప్పటి రియలిస్టిక్ నేచర్ ఉట్టిపడేలా వారణాసి సెట్ తీర్చిదిద్దారు. రామాయణంలో ఓ ముఖ్య ఘట్టాన్ని తెరకెక్కించబోతున్నట్లు ఇదివరకే చెప్పారు రాజమౌళి. ఈ క్రమంలో భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం భారీ లొకేషన్స్ వెతికి మరీ పట్టుకున్నారు. అన్నీ కాలాలు యుగాలు కలిపి ఓ విజువల్ వండర్ను సిల్వర్ స్క్రీన్పై ఆవిష్కరించేందుకు రాజమౌళి అండ్ టీం నిరంతరంగా శ్రమిస్తున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి త్వరలోనే VFX పనులు ప్రారంభించనున్నారు.
ఈ మూవీలో రుద్రుడు, రాముడిగా మహేశ్ బాబు, మందాకిని పాత్రలో ప్రియాంక చోప్రా, విలన్ రణ కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్, శివ భక్తుడిగా ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా... దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై కేఎల్ నారాయణ రూ.1,300 కోట్లతో మూవీని నిర్మిస్తున్నారు. పాన్ వరల్డ్ స్థాయిలో వచ్చే ఏడాది ఏప్రిల్ 7న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Author : Ganesh Guptha

