వేదాలను ఎవ్వరూ రాయలేదు..వీటికి మూలం బ్రహ్మదేవుడే. ఆయన ధ్యానంలో వేదాలను సృష్టించగా.. ఋషులు శ్రవణం ద్వారా గ్రహించారు
ఈ వేదాలను ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వవేదంగా విభజించారు వేద వ్యాసుడు
ఋగ్వేదంలో 1028 సూక్తులు, అగ్ని, ఇంద్ర, వరుణ ప్రధాన దేవతలకు సంబంధించిన స్తోత్రాలున్నాయి. ఈ వేదం..వేద సంస్కృతి పునాది
యజుర్వేదంలో కర్మకాండలు, యజ్ఞ విధానాలు ఉంటాయి. వీటిలో శుక్ల & కృష్ణ శాఖలు, పూజా విధానాలు ఉంటాయి
సామవేదం సంగీత ప్రధాన వేదం. భారతీయ సంగీతానికి మూలం సామవేదం.
అధర్వవేదం ఆరోగ్య, రోగనివారణకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. ఇందులో ఆరోగ్య రోగ నివారణ మంత్రాలు, జీవన శైలి, తంత్ర విజ్ఞానం ఉంటుంది

