మర్మదేశం వరల్డ్ సీక్వెల్ 'వీరభద్రుని రహస్యం' ప్రముఖ ఓటీటీ ZEE5లో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పటికీ 5 ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ కాగా... ఎపిసోడ్ ఎపిసోడ్‌కు క్షణ క్షణం ఉత్కంఠ, సూపర్ థ్రిల్ అందించింది.
అసలేంటీ వీరభద్రుని రహస్యం... వీరభద్రపురం... తరాలుగా వీరభద్రున్నే నమ్ముకున్న దైవంగా కొలిచే గ్రామస్థులు. తప్పు చేస్తే దేవుడు కచ్చితంగా శిక్షిస్తాడనేది అక్కడి ప్రజల నమ్మకం.
ఆ ఊరికి ఓ నిబంధన ఉంటుంది. చీకటి పడే లోపే అందరూ ఇళ్లకు చేరుకోవాలి. వీరభద్రుని గుడిలో గంట మోగితే గ్రామస్థులందరి గుండెల్లో గుబులే. తప్పు చేసిన ఎవరికో చావు తథ్యం అని ఆ గంట అర్థం.
గ్రామ పెద్ద కుమార్తె ఫ్రెండ్ ఊరి చూసేందుకు వచ్చి గ్రామంలో జరిగే ఘటనల మిస్టరీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంది. అసలు గ్రామంలో వరుస హత్యలకు కారణం ఏంటి? వీరభద్రుని పేరిట ఎవరు ఈ హత్యలు చేస్తున్నారు? గ్రామ పెద్ద వంశానికి, వీరభద్రుని గుడికి సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే వెంటనే సిరీస్ చూడాల్సిందే.
భీమగాని శ్రీవర్ధన్ రెడ్డి దర్శకత్వం వహించగా... అన్నీ, రఘు కుంచె, రఘు, రవి, కమల్ తూము, శిరీష, అనురాధ, బాలచంద్ర, కల్కి తదితరులు కీలకపాత్రలు పోషించారు. వారం వారం కొత్త ఎపిసోడ్స్ స్ట్రీమ్ అవుతాయి.

