Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Veligonda Project: వెలిగొండ నిర్వాసితులకు రూ.4 కోట్లు సాయం- నిత్యావసరాల కిట్ సిద్ధం చేసిన ప్రభుత్వం

Veligonda Project: వెలిగొండ నిర్వాసితులకు రూ.4 కోట్లు సాయం- నిత్యావసరాల కిట్ సిద్ధం చేసిన ప్రభుత్వం

ABP దేశం 1 week ago

Veligonda Project | అమరావతి: వెలిగొండ ప్రాజెక్టు వల్ల ఇళ్లను, స్థలాలను కోల్పోయిన నిర్వాసిత కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరింత సాయం అందించాలని నిర్ణయించింది.

ఈ ప్రాజెక్టు నిర్వాసితుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మొత్తం రూ.4.07 కోట్లను మంజూరు చేసింది. ఈ నిధులకు సంబంధించిన పరిపాలనా అనుమతులను జారీ చేస్తూ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.

10 వేల కుటుంబాలకు నిత్యావసర కిట్లు పంపిణీ

వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు సహాయక చర్యల్లో భాగంగా సుమారు 10 వేల కుటుంబాలకు ఉచిత నిత్యావసర వస్తువుల కిట్లను అందించనున్నారు. ఒక్కో కుటుంబానికి రూ.2,818 విలువైన ఈ కిట్లలో బియ్యం, కందిపప్పు, చక్కెర, వంటనూనె, ఉల్లిపాయలు, బంగాళాదుంపలను నింపి పంపిణీ చేయనున్నారు. ఈ నిత్యావసరాల పంపిణీకి గాను కూటమి ప్రభుత్వం మొత్తం రూ.2.81 కోట్లను కేటాయించింది.

నిర్వాసితుల కుటుంబాలతో పాటు వారికి జీవనాధారమైన పశువుల సంరక్షణకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. ప్రాజెక్టు పరిధిలోని 4,933 పశువులకు 30 రోజుల పాటు సరిపడా ఉచిత దాణాను పంపిణీ చేసేందుకు రూ.65.80 లక్షలను ప్రభుత్వం విడుదల చేసింది.

మహిళల కోసం ప్రత్యేకంగా 6 వేల మందికి చీర, గాజులు, పసుపు, కుంకుమలతో కూడిన కిట్లను అందించడానకి ప్రభుత్వం సిద్ధం చేసింది. వీటి కోసం రూ.60 లక్షల బడ్జెట్ను కేటాయించారు. ఈ కిట్లపై ‘వెలిగొండ ప్రాజెక్టు త్యాగమూర్తులైన అక్క-చెల్లెమ్మలకు చంద్రన్న రాఖీ కానుక’ అని ముద్రించారు. ఇప్పటికే మార్కాపురం ఆర్డీవో ఆఫీసుకి చేరిన ఈ 6 వేల మహిళా కిట్లను త్వరలోనే సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పంపిణీ చేయనున్నారు.

వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి భారీ ఏర్పాట్లు

మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండలం గంటవానిపల్లె సమీపంలో ఆగస్టు 31న సీఎం చంద్రబాబు పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీశైలం జలాశయ నిల్వల నుంచి కొల్లంవాగు ద్వారా వచ్చే కృష్ణా జలాలకు, ఫీడర్ కాలువ 4.2 కి.మీ. వద్ద ఉన్న క్రాస్ రెగ్యులేటర్ వద్ద సీఎం చంద్రబాబు జలహారతి ఇస్తారు. అనంతరం గేట్లను ఎత్తి నల్లమలసాగర్ జలాశయానికి నీటిని విడుదల చేస్తారు.

ఈ కార్యక్రమం కోసం ప్రత్యేక పైలాన్, జలహారతి ప్రదేశంలో మెట్ల నిర్మాణాలు చేశారు. అక్కడ మహిళలు, పిల్లల సాంస్కృతిక ప్రదర్శనలు ప్లాన్ చేశారు. ప్రాజెక్టుకు 1.5 కి.మీ. దూరంలో ప్రభుత్వం భారీ బహిరంగ సభను నిర్వహించడానికి ఏర్పాట్లు చేసింది. గతంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడం వల్ల పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.

Author : Shankar Dukanam

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam