టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ ఫోర్ సీనియర్ స్టార్ హీరోలలో ఎక్కువ రీమేక్ సినిమాలు చేసినది, రీమేక్ సినిమాలతో విజయాలు అందుకున్నది విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) అని చెప్పవచ్చు.
ఆయనకు ఫ్యామిలీ మ్యాన్ ఇమేజ్ ఉంది. ఫ్యామిలీ ఎమోషన్‌కు తోడు థ్రిల్ మిక్స్ చేసిన 'దృశ్యం' కథలతో ఆయనకు రెండు హిట్స్ వచ్చాయి. ముచ్చటగా మూడో 'దృశ్యం'తో ఆయన ఫ్లాప్ నుంచి తప్పించుకున్నట్టే.
రీమేక్ రైట్స్ ఇవ్వలేదు... డబ్బింగ్‌తో దెబ్బ!
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో 'దృశ్యం' సినిమాకు స్పెషల్ ప్లేస్ ఉంటుంది. మహేష్ బాబుతో చేసిన ముల్టీస్టారర్ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'కు ముందు, వెనుక ఆయన సోలో హీరోగా చేసిన సినిమాలు ఫ్లాప్. ఆ టైంలో 'దృశ్యం' చేశారు. అది మంచి విజయం సాధించింది. మలయాళంలో మోహన్ లాల్ హిట్ సినిమా 'దృశ్యం'కు రీమేక్ అది. 'దృశ్యం 2' కూడా ఆయనకు విజయం అందించింది.
మలయాళంలో విజయవంతమైన 'దృశ్యం', 'దృశ్యం 2'లను తెలుగులో వెంకటేష్, తమిళంలో లోక నాయకుడు కమల్ హాసన్, హిందీలో అజయ్ దేవగణ్ రీమేక్స్ చేశారు. మూడు భాషల్లోనూ హీరోలకు విజయాలు వచ్చాయి. మొదటి 'దృశ్యం' వచ్చినప్పుడు పరిస్థితులు వేరు... ఇప్పుడు పరిస్థితులు వేరు. పాన్ ఇండియా మార్కెట్ కల్చర్ వచ్చింది. రీమేక్స్ తగ్గాయి. అందుకని, మోహన్ లాల్ కూడా రీమేక్ రైట్స్ ఇవ్వకుండా మిగతా భాషల్లో డబ్బింగ్ చేశారు. హిందీలో కేసులు, కొన్ని అగ్రిమెంట్స్ కారణంగా డబ్ చేయడం కుదరలేదు. కానీ, మిగతా రెండు భాషల్లో డబ్ చేశారు.

