Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విద్యార్థుల ధర్మయుద్ధం: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక పురాణాల సందేశం!

విద్యార్థుల ధర్మయుద్ధం: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక పురాణాల సందేశం!

ABP దేశం 15 hrs ago

Dharmendra Pradhan Resignation: నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ దిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసనలు వెల్లువెత్తాయ్.

ఈ మేరకు ధర్మేంద్ర ప్రధాన్ సోషల్ మీడియా వేదికగా తన రాజీనామా ప్రకటించారు. ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలంటే ఇది యుగధర్మం, జ్ఞాన సంరక్షణ, అధికారం ముందు విద్యార్థుల విజయంగా అభివర్ణిస్తున్నారు విశ్లేషకులు.

GenZ Protests Dharmendra Pradhan Resignation: నాడు రైతులు - నేడు జెన్జీ - ప్రజాఉద్యమాలకు మోదీ సర్కారైనా తలొగ్గాల్సిందే !

గురు-శిష్య పరంపర (భాగవతం, మహాభారతం)

పురాణాల్లో విద్య/జ్ఞానం దేవతా సమానం. దాన్ని కలుషియం చేసినా, చేయాలి అనుకున్నా ధర్మం దెబ్బతింటుంది. ఇందుకు ఉదాహరణ మహాభారతంలో ఉపమన్యుడి గాథ.

గురువు దౌమ్యుడు శిష్యుడైన ఉపమన్యుడికి ఎన్నో కఠిన పరీక్షలు పెట్టాడు. అపారమైన భక్తి, దృఢత్వంతో గురు ఆదేశాలు పాటించి జ్ఞానం పొందాడు ఉపమన్యుడు. ఇక్కడ శిష్యుల దృఢత్వం గురు వ్యవస్థను ఉద్ధరించింది. విద్యార్థుల ఆందోళన కూడా ఈ కోవకు చెందినదే. సోనమ్ వాంగ్చుక్ ఇక్కడ విద్యార్థులకు గురువు. జ్ఞాన వ్యవస్థలో అన్యాయం పట్ల విద్యార్థుల తిరుగుబాటు, నైతిక బాధ్యత తీసుకుని సంబంధిత శాఖ మంత్రి తప్పుకోవడం ధర్మ స్థాపన.

రాజు - అధికారి నైతిన బాధ్యత ( రామాయణం)

రాయామణంలో రాముడు ప్రజాధర్మం కోసం తన వ్యక్తిగత సుఖాలు త్యాగం చేశాడు. అంటే..అధికారం కన్నా ధర్మమే ముఖ్యం. పురాణాల్లో హరిశ్చంద్రుడు లాంటి ఎందరో రాజులు సత్యం, ధర్మం కోసం సింహాసనం, అధికారం వదిలేశారు. ఇక్కడ మంత్రి రాజీనామా అంటే అధికార వ్యవస్థలో నైతిన బాధ్యత - ఇది రాజ ధర్మం. అయితే ఇది విద్యార్థుల ఒత్తిడి ద్వారా జరిగిన ధర్మస్థాపన.

CJP GenZ Protest Success Story: కాక్రోచ్ల తొలి పోరాటమే సూపర్హిట్ - రాజకీయ పార్టీలకు సాధ్యం కానిది సాధించిన జెన్జీలు !

దేవ - అసుర సంగ్రామం - జ్ఞాన రక్షణ

అసురులు లాంటి వ్యక్తుల చేతుల్లో జ్ఞానం కోల్పోతున్నప్పుడు ధర్మ స్థాపన జరగాల్సిందే. పేపర్ లీక్ అధర్మమే..ఎందుకంటే.. యోగ్యులకు అవకాశం రాకుండా చేయడమే. వ్యవస్థను శుద్ధి చేసే దిశగా విద్యార్థుల ఉద్యమం..మంత్రి రాజీనామాతో ధర్మస్థాపనకు ఓ అడుగు పడిందనుకోవాలి

కర్మ ఫలం - యుగ ధర్మం

విద్య అనేది బ్రహ్మ విద్యకు మూలం..దాన్ని కలుషితం చేస్తే ప్రజలు ఉద్యమిస్తారు..ఇది స్వయం ధర్మం..

రాజీనామా అనేది ఓ వ్యక్తి పతనం కాదు..అది త్యాగం ద్వారా వ్యవస్థ శుద్ధి. ఇది భగవద్గీత సందేశం. కర్మను నిర్వర్తించి ఫలాన్ని ఆశించకుండా వదిలేయడం.

విద్యార్థుల విజయం అంటే శక్తి జాగృతం - యువత గట్టిగా అనుకుంటే ధర్మాన్ని కాపాడుతారని అర్థం.. అయితే ఇదే పూర్తి విజయం కాదు.. తర్వాత సంస్కరణలు (ధర్మ స్థాపన) అత్యంత ముఖ్యం

సత్యం, ధర్మం ముందు అధికారం తలవంచాల్సిందే

విద్యార్థుల దృఢత్వం శిష్య ధర్మం

మంత్రి రాజీనామా రాజధర్మం

జ్ఞాన వ్యవస్థ శుద్ధివైపు అడుగుపడితే...ఇది శుభసూచనే..

Dharmendra Pradhan Letter Summary: ధర్మేంద్ర ప్రధాన్ దేశ యువతకు రాసిన లేఖలో ఏం ఉంది? పూర్తి వివరాలు ఇవే!

Author : RAMA

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam