Sun TV Network shares | తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఎర్లీ ట్రెండ్ వచ్చేసరికి అధికార ద్రావిడ మున్నేట్ర కజగం (DMK) పరిస్థితి దారుణంగా ఉంది.
నటుడు విజయ్కి చెందిన తమిళగ వెట్రి కజగం (TVK) అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ట్రెండ్స్ వచ్చాయి. దాంతో సన్ టీవీ నెట్వర్క్ షేర్లు 9.5% కుప్పకూలి రోజువారీ కనిష్ట స్థాయి రూ. 547.55 కి పడిపోయాయి.
సన్ టీవీ నెట్వర్క్ షేర్లు ముందురోజు ముగింపు ధర రూ.605 తో పోలిస్తే బీఎస్ఈ (BSE) లో 9.49 శాతం తగ్గి, ఆ రోజు కనిష్ట స్థాయి రూ. 547.55 ని టచ్ చేశాయి. ఆపై క్రమంగా పుంజుకున్న సన్ టవీ నెట్వర్క్ షేర్లు పుంజుకుని సోమవారం మార్కెట్ ముగిసే సమయానికి రూ.573 అయింది.
సన్టీవీ నెట్వర్క్ షేర్లు కోలుకుంటాయా..
సన్ గ్రూప్లో భాగమైన సన్ టీవీ (SUN Tv network)కి భారత బిలియనీర్, మీడియా అధినేత కళానిధి మారన్ అధినేత. ఈయన డీఎంకే పార్టీకి సంబంధించిన వ్యక్తి . డీఎంకే దిగంగత అధ్యక్షుడు ఎం. కరుణానిధికి మనవడు మారన్. సీఎం ఎం.కె. స్టాలిన్కు బంధువు కావడంతో సన్ టీవీ నెట్ వర్క్ షేర్లు భారీగా పతనమై చివర్లో కోలుకున్నాయి. సన్ టీవీ షేర్ల పతనాన్ని కేవలం ఒక రోజు సెంటిమెంట్ అని వినిపిస్తోంది.
గత ఐదేళ్ల డీఎంకే పాలనలో కూడా ఈ స్టాక్ అంతగా లాభపడలేదు. ఇది కేవలం రాజకీయ సాన్నిహిత్యం మాత్రమే ఆదాయ వృద్ధికి లేదా వాల్యుయేషన్ మెరుగుపడటానికి 100 శాతం చాన్స్ ఉందని చెప్పలేం. ప్రస్తుతం ప్రతికూల రాజకీయ పరిణామాలైనా ఈ స్టాక్ కొన్ని రోజులపాటు ఒత్తిడిలో ఉంచవచ్చు. కొన్నిసార్లు రెండు మూడు రోజుల్లోనే స్టాక్ మళ్లీ కోలుకుంటుందని విశ్లేషకులు కొందరు అన్నారు.
2021లో స్టాలిన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత సన్ టీవీ నెట్వర్క్ షేర్లు మిశ్రమ ట్రెండ్ను చూశాయి. ఇది 2021, 2023 లలో వరుసగా 4 శాతం, 46% సానుకూల వార్షిక రాబడులను ఇచ్చింది. ఈ స్టాక్ 2022లో 2%, 2024లో 4 శాతం, 2025లోనూ 14 శాతం క్షీణించింది. ఈ ఏడాది సైతం ఇప్పటివరకూ 4% నష్టపోయింది.
తమిళనాడు ఎన్నికల ట్రెండ్స్
తమిళనాడు ఎన్నికల రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు నటుడు విజయ్ ఎదురుచూస్తున్నట్లు కనిపిస్తుండగా, అధికార డీఎంకే మూడో స్థానానికి పడిపోవడంతో ఆ పార్టీకి వ్యతిరేకంగా రికార్డు స్థాయి వ్యతిరేక పవనాలు స్పష్టంగా కనిపించాయి.
విజయ్ పార్టీ టీవీకే 107 స్థానాల్లో విజయాలు, ఆధిక్యం కలిపి ప్రభావం చూపుతోంది. పార్టీ స్థాపించిన కేవలం రెండేళ్లలోనే తమిళనాడులో ఏ పార్టీ కూడా అధికారాన్ని చేజిక్కించుకోలేదు కానీ విజయ్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు.
సన్ టీవీ షేర్ల భవిష్యత్ అంచనా
ప్రస్తుతానికి సన్ టీవీ షేర్ల భవిష్యత్ అంచనా ప్రతికూలంగా కనిపిస్తోంది. ఎందుకంటే దీని ప్రధాన వ్యాపారం ప్రకటనల వృద్ధి, ఓటీటీ (OTT) వైపు మళ్లడం వల్ల సవాళ్లను ఎదుర్కొంటోంది. రాబడి వృద్ధి, కంటెంట్ మానిటైజేషన్, మూలధన కేటాయింపులలో స్పష్టమైన మెరుగుదల ఉంటే తప్ప, సన్ నెట్వర్క్ స్టాక్ అధిక వృద్ధిని సాధించడంలో ఇబ్బంది పడవచ్చు అని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు.
Author : Shankar Dukanam

