Dailyhunt
Vijay Networth: టీవీకే అధినేత విజయ్ ఆస్తుల విలువెంత? సూపర్ స్టార్లలో ఒకరిగా దళపతి స్టార్‌డమ్

Vijay Networth: టీవీకే అధినేత విజయ్ ఆస్తుల విలువెంత? సూపర్ స్టార్లలో ఒకరిగా దళపతి స్టార్‌డమ్

ABP దేశం 1 week ago

Vijay Net Worth | చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి. డీఎంకే గెలుస్తుందా.. అన్నాడీఎంకే నెగ్గుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో నటుడు, టీవీకే పార్టీ అధినేత జోసెఫ్ విజయ్ ప్రభంజనం సృష్టించారు.

ఈసారి ఎన్నికల బరిలో సూపర్ స్టార్ విజయ్ నిలవడంతో పాటు తొలి ఎన్నికల్లోనే విజయం సాధించి దశాబ్దాల పార్టీలకు షాకిచ్చారు. తాజాగా జరుగుతున్న ఓట్ల లెక్కింపులో కొత్త పార్టీ TVK దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఆయన ఇతర పార్టీల కంటే బాగా ముందున్నారు. ఆయన రాజకీయ ప్రయాణం గట్టిగానే మొదలుపెట్టారు. విజయ్ కెరీర్, ఆస్తి, లైఫ్స్టైల్ విషయాలపై ఓ లుక్ వేయండి.

18 ఏళ్ల వయసులో హీరోగా ఎంట్రీ

1974 జూన్ 22న జన్మించిన విజయ్ అసలు పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. ఆయన సినీ బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబం నుండి వచ్చారు. తండ్రి ఎస్ఎ. చంద్రశేఖర్ ఒక దర్శకుడు, తల్లి శోభా చంద్రశేఖర్ ఒక గాయని. విజయ్ తన కెరీర్ను చైల్డ్ ఆర్టిస్ట్గా మొదలుపెట్టారు. తరువాత కాలేజీ చదువు మధ్యలోనే వదిలేసి 18 సంవత్సరాలకే 'నాలైయా తీర్పు' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇండస్ట్రీలో అంచెలంచెలుగా ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటివరకు దాదాపు 69 సినిమాల్లో నటించిన ఆయన ప్రత్యేక శైలి తమిళ సినిమాకు 'దళపతి'ని చేసింది.

విజయ్ ఆస్తి విలువ..

టీవీకే అధినేత విజయ్ ఆస్తి విషయానికి వస్తే.. PTI నివేదిక ప్రకారం, ఎన్నికల అఫిడవిట్లో మొత్తం ఆస్తి దాదాపు 603 కోట్ల రూపాయలుగా చూపించారు. ఇందులో 400 కోట్లకు పైగా చరాస్తులు, దాదాపు 198 కోట్ల రూపాయల స్థిర ఆస్తులు ఉన్నాయి. ఆయన బ్రాండ్ ఎండార్స్మెంట్, రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ఇతర వ్యాపారాల ద్వారా సంపాదిస్తున్నారు. అంతేకాకుండా, ఆయన వద్ద దాదాపు 883 గ్రాముల బంగారం, 15 లక్షల విలువైన వెండి ఆభరణాలు కూడా ఉన్నాయి.

విజయ్ లైఫ్స్టైల్ చాలా లగ్జరీగా ఉండేది. ఆయనకు ఖరీదైన కార్లంటే చాలా ఇష్టం. ఆయన కలెక్షన్స్లో BMW 530d, Lexus, Toyota Vellfireతో పాటు BMW i7 వంటి కార్లు ఉన్నాయి. దీనితో పాటు చెన్నై, అనేక ఇతర ప్రదేశాలలో ఆయనకు అనేక ఇళ్లు, వాణిజ్య ఆస్తులున్నాయి. విజయ్కి కొడైకెనాల్లో కూడా కోట్ల విలువైన వ్యవసాయ భూమి ఉంది.

విజయ్ కెరీర్లో హిట్ సినిమాలు

విజయ్ తన కెరీర్లో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. రీమేక్లతోనూ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించారు. తేరి, మండల్, బీస్ట్, షాజహాన్, లియో వంటి సినిమాలు పేరు తెచ్చాయి. ముఖ్యంగా లియో 2023లో బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టింది. ఆయన చివరి సినిమా 'జన నాయకన్' గురించి కూడా చాలా చర్చ జరుగుతోంది. ఇది ఆయన చివరి సినిమా అని విజయ్ ముందుగానే చెప్పారు. రాజకీయాల్లో వస్తున్నానని, పూర్తి స్థాయి ప్రజా జీవితంలో గడుపుతానని విజయ్ స్పష్టం చేశారు. తన అభిమానులు, రాష్ట్ర ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకువచ్చేందుకు సినిమాలకు గుడ్ బై చెప్పానని పలుమార్లు తెలిపాడు.

Author : Shankar Dukanam

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam