రౌడీ బాయ్, యంగ్ హీరో విజయ్ దేవరకొండకు ఆయన భార్య రష్మిక బర్త్ డే స్పెషల్ క్యూట్ విషెష్ తెలిపారు.
పుట్టిన రోజునాడు విజయ్‌తో గడిపిన క్షణాలను రష్మిక రివర్స్ ఆర్డర్‌లో తెలిపారు.
జిమ్‌కు వెళ్లిన దగ్గర నుంచీ కారులో విజయ్‌తో గడిపిన క్షణాలు, సెల్ఫీ మూమెంట్స్‌ను షేర్ చేశారు.
'ఈ రోజు నా వాడి బర్త్ డే... ఈ రోజు ఇలా గడిచింది' అంటూ క్యాప్షన్ ఇచ్చారు రష్మిక. నా ప్రియమైన విజ్జూకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని రాసుకొచ్చారు.
విజయ్, తన ఫ్యామిలీతో గడిపిన క్షణాలను షేర్ చేసుకున్నారు రష్మిక. అంతకు ముందు అభిమానులతో విజయ్ బర్త్ డే కేక్ కోశారు.
ఇంటి బాల్కనీలోకి వచ్చిన రష్మిక, విజయ్ ఫ్యామిలీ వారికి అభివాదం చేశారు. రష్మికను వదిన వదిన అంటూ అభిమానులు పిలిచారు.
విజయ్ కోసం స్పెషల్‌గా రణబాలి మోడల్‌లో కేక్ రెడీ చేయించారు. ఇది వైరల్‌గా మారింది.

