Thalapathy Vijay Trisha Top Trending Movies : కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్, సౌత్ క్వీన్ త్రిష పేర్లు సోమవారం నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే గ్రాండ్ విక్టరీతో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన సీఎం కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తుండడంతో టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకూ స్టార్ హీరోస్, దర్శక నిర్మాతలు ఆయనకు విషెష్ చెబుతున్నారు.
సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న త్రిష... ఆ తర్వాత నేరుగా విజయ్ ఇంటికి వెళ్లి తిరుమల ప్రసాదాన్ని అందజేశారు. దాదాపు గంట పాటు చర్చలు జరిపారు. గత కొంతకాలంగా వీరిద్దరి పేర్లు హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా విజయ్ విజయంతో ఇద్దరూ కలిసి నటించిన మూవీస్ మరోసారి ట్రెండ్ అవుతున్నాయి. మరి వారు కలిసి నటించిన మూవీస్ ఏ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయంటే...
బ్లాక్ బస్టర్ 'గిల్లి' (Ghilli)
విజయ్, త్రిష కలిసి నటించిన ఫస్ట్ మూవీ గిల్లి (Ghilli). ఈ యాక్షన్ ఎంటర్టైనర్కు ధరణి దర్శకత్వం వహించగా... ప్రకాష్ రాజ్ కీలకపాత్ర పోషించారు. 2003లో వచ్చిన మహేశ్ బాబు సూపర్ హిట్ మూవీ 'ఒక్కడు'కి ఇది రీమేక్. ప్రస్తుతం ఈ మూవీ 'SunNXT'లో స్ట్రీమింగ్ అవుతోంది.
తిరుపాచి (Thirupaachi)
ఈ మూవీకి పేరరసు దర్శకత్వం వహించారు. విజయ్ కెరీర్లోనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా నిలిచిన ఈ మూవీ సంచలన విజయం సాధించింది. ఓ గ్రామీణ యువకుడు తన చెల్లి పెళ్లి తర్వాత ఆమెను టౌన్కు పంపిస్తాడు. ఆ తర్వాత ఆ నగరంలో రౌడీయిజం, దుండగులను ఎలా అంతం చేశాడనేదే స్టోరీ. ఈ సినిమా 'SunNXT'లో అందుబాటులో ఉంది.
ఆది (Aathi)
విజయ్, త్రిష జంటగా నటించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ 2006లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో భారీ విజయం సాధించిన కల్యాణ్ రామ్ అతనొక్కడేకు ఇది రీమేక్. రమణ ఈ మూవీకి దర్శకత్వం వహించగా... తమిళంలో మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో అందుబాటులో ఉంది.
Also Read : విజయ్ తర్వాత ఎన్టీఆరే! తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకే విజయంతో హోరెత్తిపోతున్న సోషల్ మీడియా!
Also Read : రామ్ చరణ్, సుకుమార్ మూవీ - షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే!
కురువి (Kuruvi)
2008లో వచ్చిన ఈ యాక్షన్ కామెడీ మూవీకి ధరణి దర్శకత్వం వహించారు. విజయ్, త్రిషలతో పాటు వివేక్, సుమన్, ఆశిష్ విద్యార్థి కీలకపాత్రలు పోషించారు. తన తండ్రి మిస్సింగ్కు కారణమైన ఓ డాన్ కోసం వెతికే ఓ యువకుడి కథే ఈ స్టోరీ. తమిళంతో పాటు తెలుగులోనూ 'కురువి' డబ్ అయ్యింది. అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు యాపిల్ టీవీలో మూవీని చూడొచ్చు.
లియో (Leo)
దాదాపు 15 ఏళ్ల తర్వాత విజయ్, త్రిష జంటగా నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ లియో (Leo). లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. తన కుటుంబం కోసం ఓ వ్యక్తి తన గతంతో చేసిన పోరాటమే ఈ మూవీ. ప్రస్తుతం ఈ మూవీ 'నెట్ ఫ్లిక్స్'లో అందుబాటులో ఉంది.
Also Read : విజయ్ గ్రాండ్ విక్టరీ - ట్రెండింగ్లో జన నాయగన్...టైటిల్ మార్చాలంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్
Author : Ganesh Guptha

