Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Vipassana : విపాసన అంటే ఏమిటి? ఎలా చేయాలి.. రోజూ చేస్తే కలిగే ప్రయోజనాలు ఇవే

Vipassana : విపాసన అంటే ఏమిటి? ఎలా చేయాలి.. రోజూ చేస్తే కలిగే ప్రయోజనాలు ఇవే

ABP దేశం 1 week ago

Vipassana Benefits : ప్రస్తుత కాలంలో పని ఒత్తిడి, వ్యక్తిగత సమస్యలు, ఆందోళన, సరైన నిద్ర లేకపోవడం వంటి కారణాలతో చాలామంది మానసిక ప్రశాంతత కోసం మెడిటేషన్ వైపు మొగ్గు చూపుతున్నారు.

అలాంటి ధ్యాన పద్ధతుల్లో విపాసన కూడా ఒకటి. ఇది మనసును బలవంతంగా ఒక ఆలోచనపై కేంద్రీకరించడం కంటే.. మనలో జరుగుతున్న ఆలోచనలు, భావాలు, శరీర అనుభూతులను జడ్జ్ చేయకుండా గమనించడాన్ని నేర్పుతుంది.

విపాసన అంటే..

విపాసన ఒక పురాతన ధ్యాన పద్ధతి. ముందుగా సహజమైన శ్వాసను గమనిస్తూ.. మనసును దానిలో నిమగ్నం చేసుకోవడం నేర్పిస్తారు. ఆ తర్వాత శరీరంలో కలిగే అనుభూతులను ఇష్టం, అయిష్టం లేకుండా గమనించాలి. ఉదాహరణకు.. కూర్చున్నప్పుడు కాళ్లలో నొప్పి వస్తే.. దాన్ని వెంటనే నొప్పి పోవాలి అని కోరుకోవడం లేదా అసహనపడడం కాకుండా.. ఆ అనుభూతిని గమనిస్తూ ఉండటం విపాసన సాధనలో ముఖ్యమైన భాగం.

అదే విధంగా మంచి ఆలోచన వచ్చినప్పుడు దానిని పట్టుకుని ఉండకుండా, ప్రతికూల ఆలోచన వచ్చినప్పుడు దాన్ని అణచివేయకుండా.. రెండింటినీ గమనించడం విపాసనలో భాగంగా నేర్చుకుంటారు.

రోజూ యోగా చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే.. మగవారికి, ఆడవారికి ఈ ప్రయోజనాలు అందుతాయి

విపాసన ఎలా చేయాలంటే..

ఎవరూ మిమ్మల్ని డిస్టర్బ్ చేయని ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోవాలి. నేలపై లేదా కుర్చీలో సౌకర్యంగా కూర్చోవచ్చు. వెన్నెముకను సాధ్యమైనంత నిటారుగా ఉంచి.. శరీరాన్ని బిగించకుండా రిలాక్స్గా కూర్చోండి. కళ్లు మూసుకోవచ్చు. నార్మల్​గా బ్రీత్ తీసుకోండి. శ్వాస లోపలికి వెళ్లడం, బయటకు రావడం గమనించండి. ఆ సమయంలో శరీరంలో కలిగే అనుభూతులను గమనించండి. వేడి, చలి, ఒత్తిడి, దురద, నొప్పి లేదా తేలికపాటి అనుభూతి ఏదైనా వచ్చినా.. వెంటనే స్పందించకుండా గమనించడమే సాధన.

మంచి అనుభూతి వచ్చినప్పుడు దానిని మరింత ఎక్కువగా కోరుకోవడం, అసౌకర్యం వచ్చినప్పుడు వెంటనే దాన్ని తొలగించాలని ప్రయత్నించడం కాకుండా.. అది మారుతూ ఉండే అనుభూతి అని గుర్తించాలి. మొదట 5 నిమిషాలతో ప్రారంభించి.. అలవాటు అయిన తర్వాత సమయాన్ని క్రమంగా పెంచుకోవచ్చు. ఎందుకంటే విపాసనలో కేవలం ఎంతసేపు కూర్చున్నామన్నది ముఖ్యం కాదు.. ఎలా గమనిస్తున్నామన్నదే ముఖ్యం.

విపాసన వల్ల కలిగే ప్రయోజనాలు

విపాసనకు సంబంధించిన ప్రత్యేక ఆరోగ్య ప్రయోజనాలపై పరిశోధనలు పరిమితంగా ఉన్నప్పటికీ.. జరిగిన పరిశోధనల్లో కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని తేల్చారు. మన ఆలోచనలు, భావాలను జడ్జ్ చేయకుండా గమనించే సామర్థ్యాన్ని పెరుగుతుంది. దీనివల్ల ఒత్తిడి తగ్గే అవకాశం ఎక్కువ. యాంగ్జైటీ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. కొన్ని పరిశోధనలు నిద్ర నాణ్యత మెరుగుపడడాన్ని హైలెట్ చేశాయి. కోపం, ఆందోళన లేదా అసహనం వచ్చిన వెంటనే స్పందించకుండా.. బ్యాలెన్స్గా ఉండడం నేర్పుతుంది.

ఏకాగ్రత పెరిగే అవకాశం ఉంది. అలాగే రోజువారీ జీవితంలో వచ్చే ఎమోషన్స్, ఒత్తిడిని వెంటనే అనుసరించకుండా వాటిని గమనించే అలవాటు పెరుగుతుంది. కొన్ని పరిశోధనల్లో తినే ప్రవర్తనలో మార్పులు కనిపించాయి. శరీరానికి కావాల్సిన ఫుడ్ ఇవ్వడం తెలుస్తుంది.

ఉదయం చేస్తే మంచిదా? రాత్రి చేయాలా?

విపాసన ఉదయం, సాయంత్రం కూడా చేయవచ్చు. అయితే రోజూ ఒకే సమయానికి చేయడం అలవాటు చేస్తే మంచిది. ఉదయం నిద్రలేచిన తర్వాత లేదా రాత్రి పడుకునే ముందు ప్రశాంతమైన సమయాన్ని ఎంచుకోవచ్చు. అయితే విపాసనను వ్యాధిని నయం చేసే చికిత్సగా చూడకూడదు. మానసిక ప్రశాంతతో జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి హెల్ప్ చేసే సాధనంగా చూడవచ్చు.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

Author : Geddam Vijaya Madhuri

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam