Korean Skincare For Manchu Family: మంచు ఫ్యామిలీ జపాన్ వెళ్ళింది. లెజెండరీ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు దంపతులతో పాటు ఆయన పెద్ద కుమారుడు విష్ణు మంచు - వెరోనికా దంపతులు పిల్లలతో కలిసి టోక్యో వెళ్ళారు.
ట్రిప్ ఎంజాయ్ చేశారు. ఫ్యామిలీ అంతా కలిసి వెకేషన్‌కు వెళ్ళడమే కాదు... స్కిన్ కేర్ మీద కూడా దృష్టి పెట్టారు. కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌కు వెళ్ళారు. నెట్టింట ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
మా క్లినిక్‌కు టాలీవుడ్ లెజెండ్స్ వచ్చారు
''టాలీవుడ్ లెజెండ్స్ మోహన్ బాబు గారు, విష్ణు మంచు గారు మా క్లినిక్‌కి రావడం మాకు దక్కిన గౌరవం! వారి అభిమానం, దయ నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు'' అని కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్ డెర్మటాలజీ మేనేజర్ జెమ్ జెమ్ ఆటోజ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. కొరియా, ఇంగ్లీష్, తెలుగులో క్యాప్షన్ ఇచ్చారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో మోహన్ బాబు, విష్ణు మంచుతో దిగిన ఫోటోలు షేర్ చేశారు జెమ్ జెమ్ ఆటోజ్. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. దాంతో మంచు ఫ్యామిలీ కొరియన్ స్కిన్ కేర్ ఫాలో అవుతోందని తెలుగు ప్రేక్షకులకు అర్థం అయ్యింది. మరి ఆ క్లినిక్ జపాన్‌లో ఉందా? లేదంటే మంచు ఫ్యామిలీ సౌత్ కొరియా వెళ్ళిందా? అనేది తెలియాల్సి ఉంది.
Mohan Babu Upcoming Movies: 'కన్నప్ప'తో పాన్ ఇండియా హిట్ అందుకున్న విష్ణు మంచు... ఆ తర్వాత సినిమాను ఇంకా అనౌన్స్ చేయలేదు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్నయ్య (రమేష్ బాబు) కుమారుడు జైకృష్ణ ఘట్టమనేని కథానాయకుడిగా పరిచయమైన 'శ్రీనివాస మంగాపురం'లో మోహన్ బాబు కీలక పాత్ర చేశారు. హీరో తాతయ్యగా కనిపించారు. నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న 'ది ప్యారడైజ్'లో మెయిన్ విలన్ రోల్ చేస్తున్నారు.
Author : S Niharika

