Dailyhunt
Walnuts for Health : వాల్‌నట్స్ తినే సరైన పద్ధతి..  ఇలా తింటేనే గుండె, మెదడుకు డబుల్ బెనిఫిట్స్

Walnuts for Health : వాల్‌నట్స్ తినే సరైన పద్ధతి.. ఇలా తింటేనే గుండె, మెదడుకు డబుల్ బెనిఫిట్స్

ABP దేశం 1 week ago

Raw Walnuts : వాల్నట్స్ చిన్నగా కనిపించినా.. ఆరోగ్యానికి ఇవి భారీ ప్రయోజనాలు అందించే సూపర్ ఫుడ్​గా చెప్తారు. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్స్, ఫైబర్ సమృద్ధిగా ఉండే వీటిని గుండె ఆరోగ్యంతో పాటు..

బ్రెయిన్, గట్ హెల్త్ కూడా మెరుగవుతుంది. అందుకే పోషకాహార నిపుణులు, ఆరోగ్య నిపుణులు వీటిని డైట్​లో యాడ్ చేసుకోమంటారు. అయితే వాటి పోషకాలు పూర్తిగా మీకు అందాలంటే.. వాటిని తినేప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాల్​నట్స్ ఎంచుకోవడం నుంచి.. ఎలా తింటే మంచిదో వరకు ఇప్పుడు తెలుసుకుందాం.

సాల్ట్ లేనివి బెస్ట్

వాల్నట్స్ను పచ్చిగా, ఉప్పు లేకుండా ఉండేవి ఎంచుకోవాలి. వేయించిన వాటిలో ఒమేగా-3 ఫ్యాట్స్ తగ్గిపోతాయి.ఉప్పు వల్ల సోడియం పెరిగి బీపీ రిస్క్ పెరుగుతుంది. స్టడీస్ ప్రకారం వాల్నట్స్ పచ్చిగా తింటే.. చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. వీటిని ఫ్రిజ్లో స్టోర్ చేస్తే 6 నెలల వరకు పోషకాలు ఉంటాయి.

నానబెట్టి తింటే..

వాల్​నట్స్​ తినాలనుకుంటే.. రాత్రంతా కనీసం 8 గంటలు నానబెట్టి తింటే మంచిది. ఇలా చేయడం వల్ల వాటిలోని ఫైటిక్ యాసిడ్ తగ్గుతుంది. ఐరన్, జింక్ అబ్జార్ప్షన్ మెరుగవుతుంది. డైజెషన్ ఈజీ అవ్వడంతో పాటు బ్లోటింగ్ తగ్గుతుంది. కొన్ని స్టడీస్ ప్రకారం నానబెట్టి తినడం వల్ల 20–30% వరకు పోషకాలు శరీరానికి అందుతాయి.

రోజుకు ఎంత తినాలి?

రోజూ వాల్​నట్స్ తినాలంటే.. మీరు ఓ గుప్పెడు తినొచ్చు. వీటి ద్వారా సుమారు 180–190 క్యాలరీలు అందుతాయి. మెటబాలిజం మెరుగవుతుంది. బ్లడ్ షుగర్ స్టేబుల్గా ఉంటుంది. 8 వారాలు రోజు 43 గ్రాముల వాల్నట్స్ తిన్నవారిలో.. బ్రెయిన్ ఫంక్షన్ మెరుగైంది. ఇన్ఫ్లమేషన్ తగ్గినట్లు స్టడీలు తేల్చాయి.

ఇలా తింటే మరింత లాభం

వాల్నట్స్ను నేరుగా కాకుండా ఓట్స్, సలాడ్స్, యోగర్ట్, స్మూతీస్ రూపంలో తీసుకుంటే ఆకలి తగ్గుతుంది. అలాగే షుగర్ స్పైక్స్ కాకుండా ఉంటాయి. రోజంతా ఎనర్జీ ఇస్తుంది.

విటమిన్ C ఫుడ్స్​తో..

వాల్నట్స్ను ఆరెంజ్, స్ట్రాబెర్రీ, ఆమ్లా వంటి విటమిన్ సి ఫుడ్స్​తో తింటే మరింత లాభం. యాంటీఆక్సిడెంట్ ఎఫెక్ట్ రెట్టింపు ఉంటాయి. ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. మెమరీ పవర్ కూడా బాగా పెరుగుతుంది.

తినేందుకు బెస్ట్ టైమ్

వాల్​నట్స్ ఉదయం లేదా మధ్యాహ్నం తింటే బ్రెయిన్ పవర్ పెరుగుతుంది. సాయంత్రం తింటే గట్ హెల్త్, నిద్ర మెరుగవుతుంది. గట్ బ్యాక్టీరియా వాల్నట్స్ను “urolithins”గా మార్చి క్యాన్సర్ నుంచి ప్రొటెక్షన్ అందిస్తాయి.

గుండె, బ్రెయిన్ ఆరోగ్యానికి

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం వాల్నట్స్ రెగ్యులర్గా తింటే.. LDL తగ్గుతుంది. దీంతో హార్ట్ డిసీజ్ రిస్క్ తగ్గుతుందని తెలిపింది. వీటిలోని “good fats” ఆర్టరీలను క్లీన్గా ఉంచుతాయి. వాల్నట్స్లో DHA (ఒమేగా-3) వల్ల మెమరీ షార్ప్ అవుతుంది. ఫోకస్ పెరిగి.. డిప్రెషన్ రిస్క్ తగ్గుతుంది. అలాగే కొన్ని రీసెర్చ్​ల ప్రకారం.. వాల్నట్స్ తినేవారిలో అల్జీమర్స్ స్లోగా ఉంటుంది.

గట్ హెల్త్

వాల్నట్స్​ తింటే మంచి గట్ బ్యాక్టీరియా పెరుగుతుంది. డైజెషన్ సపోర్ట్ చేస్తాయి. ఒక స్టడీ ప్రకారం.. వాల్నట్స్ తిన్నవారిలో మైక్రోబయోమ్ డైవర్సిటీ పెరిగింది. అలాగే ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతి ఇచ్చే.. ఓవర్ ఈటింగ్ తగ్గిస్తాయి. దీంతో బరువు కూడా తగ్గుతారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నట్స్ అలర్జీ ఉన్నవారు, కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు వీటికి దూరంగా ఉంటే మంచిది. అధికంగా తింటే డైజెషన్ సమస్యలు రావచ్చు. వాల్ నట్స్ సరైన విధంగా సరైన సమయంలో తింటే.. హార్ట్, బ్రెయిన్, గట్ ఆరోగ్యాన్ని ఒకేసారి కాపాడుకోవచ్చు.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

Author : Geddam Vijaya Madhuri

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam