West Bengal Elections 2026: పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక పెను మార్పునకు రంగం సిద్ధమైంది. దశాబ్ద కాలానికిపైగా రాష్ట్రాన్ని ఏక ఛత్రాధిపత్యంగా ఏలిన మమతా బెనర్జీని ప్రజలు ఇంటికి పంపించారు.

West Bengal Elections 2026: పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక పెను మార్పునకు రంగం సిద్ధమైంది. దశాబ్ద కాలానికిపైగా రాష్ట్రాన్ని ఏక ఛత్రాధిపత్యంగా ఏలిన మమతా బెనర్జీని ప్రజలు ఇంటికి పంపించారు.
ముఖ్యమంత్రి రేసులో సువేందుకు పోటీగా పాల్
బీజేపీ అధికారంలోకి రావడం దాదాపు ఖాయం కావడంతో ఇప్పుడు అందరి దృష్టి బెంగాల్ తదుపరి సీఎం ఎవరు అనే అంశంపైకి మళ్లింది. ముఖ్యంగా ఇద్దరు మహిళా నేతల పేర్లు ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. అగ్నిమిత్ర పాల్ అసన్సోల్ దక్షిణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో నిరసనల్లో చురుగ్గా పాల్గొంటూ, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమైన నేతగా ఆమె ముందు ఉంటున్నారు. అందుకే అదిష్టానం ఆమె వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది.
మమతా ప్రారంభించారు - బీజేపీ ముగించింది - బెంగాల్లో దీదీ ఓటమికి 5 కారణాలు
మాజీ రాజ్యసభ ఎంపీ, ప్రముఖ నటి రూపా గంగూలీ కూడా సీఎం రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. సోనార్పూర్ దక్షిణ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా పట్టణ ఓటర్లలో ఆమెకు విపరీతమైన ఆదరణ ఉంది. దశాబ్ద కాలంగా బీజేపీలో ఉంటూ, పార్టీ మహిళా విభాగంలో కీలక పాత్ర పోషించిన ఆమెకు పాలనాపరమైన అనుభవం కూడా తోడవుతుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
సువేందు అధికారి కూడా సీఎం రేసులో ఉన్నారు. మమతకు కుడి భుజంగా ఉంటూ వచ్చిన ఆయన గత ఎన్నికల ముందు టీఎంసీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అప్పటి నుంచి మమతి నిజమైన ప్రత్యర్థిగా మారారు. ఆమె వైఖరిని ఎండగడుతూ బీజేపీని రూట్ లెవల్కు తీసుకెళ్లడంతో విజయవంతం అయ్యారు. నేటి విజయంలో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంది. అందుకే ఆయన పేరును కూడా సీఎం సీటు కోసం బీజేపీ అధిష్ఠానం పరిశీలిస్తోంది.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కాషాయ జెండా రెపరెపలు! కాబోయే ముఖ్యమంత్రి సువేందు అధికారి!
ఏప్రిల్ నెలలో రెండు దశల్లో జరిగిన పోలింగ్కు సంబంధించిన లెక్కింపు ఇప్పుడు జరుగుతోంది. ఇందులో బీజేపీ మెజార్టీ స్థానాల్లో దూసుకెళ్తోంది. దశాబ్దాలుగా అధికారంలో ఉన్న టీఎంసీ ప్రభుత్వంపై ప్రజల్లో పేరుకుపోయిన అసంతృప్తి బీజేపీకి వరంగా మారింది. కేంద్ర నాయకత్వ నుంచి క్షేత్రస్థాయి కార్యకర్తల వరకు బీజేపీ పక్కా ప్రణాళికతో ప్రచారం నిర్వహించడం కలిసి వచ్చింది. బెంగాల్ ప్రజలు ఒక కొతత్ మార్పును, సుస్థిర పాలనను ఆశించడం ఈ తీర్పునకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
బెంగాల్లో బీజేపీ మతపరమైన సమీకరణాలతోపాటు అభివృద్ధి మంత్రాన్ని కూడా బలంగా తీసుకెళ్తింది. ఉద్యోగ అవకాశాలు, శాంతి భద్రతల అంశాలపై ప్రజలను ఆకర్షించడంలో ఆ పార్టీ సఫలమైంది. టీఎంసీ అంతర్గత కుమ్ములాటలు కూడా ఆ పార్టీ విజయావకాశాలను దెబ్బ తీశాయి.
పశ్చిమ బెంగాల్ దశాబ్దాల తరబడి వామపక్షాల కోటగా ఉండేది. 2011లో మమతా బెనర్జీ కోటను బద్దలు కొట్టి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. అప్పటి నుంచి టీఎంసీ బలంగా ఎదిగింది. అయితే 2019లో లోక్ సభ ఎన్నికల నుంచి బీజేపీ రాష్ట్రంలో క్రమంగా పుంజుకోవడం ప్రారంభించింది. 2021లో విఫలమైనప్పటికీ, 2026లో మాత్రం బీజేపీ గురి తప్పలేదు.
Author : Khagesh