YS Jagan At YSR Ghat: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద బుధవారం మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా, వైఎస్ఆర్ సతీమణి వైఎస్ విజయమ్మ నివాళులర్పించారు.
తండ్రి సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి వైఎస్ జగన్ అంజలి ఘటించారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని వైఎస్ఆర్ను గుర్తుచేసుకున్నారు.
విజయమ్మ భావోద్వేగం
వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం.. జగన్ను చూడగానే విజయమ్మ భావోద్వేగానికి గురయ్యారు. ఆయనను ఆప్యాయంగా హత్తుకుని ముద్దుపెట్టుకున్నారు. జగన్తో పాటు ఆయన సతీమణి వైఎస్ భారతిని కూడా విజయమ్మ దగ్గరకు తీసుకుని, ముద్దుపెట్టుకుని ఆశీర్వదించారు. అయితే వైఎస్ జగన్, వైఎస్ షర్మిలా వేరు వేరుగా వచ్చి తండ్రికి నివాళులర్పించారు.

ఎంతో మంది హృదయాల్లో ఉన్నావ్... భర్త పవన్ బర్త్ డేకి అన్నా కొణిదెల బ్యూటిఫుల్ పోస్ట్
వేరు వేరుగానే నివాళులు
వైఎస్ఆర్ ప్రజాసేవను, సంక్షేమ కార్యక్రమాలను వైఎస్ జగన్ గుర్తుచేసుకున్నారు. తల్లి విజయమ్మ ఆశ్వీర్వదం కోసం వెళ్లగా జగన్ను విజయమ్మ ముద్దాడింది. అనంతరం వైఎస్ఆర్ ఘాట్ సమీపంలోనే ఉన్న వైఎస్ఆర్ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వైసీపీ కార్యకర్తలను కలుసుకొని ఇడుపులపాయలో ఉన్న హెలీప్యాడ్కు చెరుకొన్నారు జగన్. హెలీకాప్టర్లో బెంగుళూరుకు బయలుదేరి వెళ్లారు. వైఎస్ జగన్ వెళ్లిన తర్వాత గెస్ట్ హౌస్లో ఉన్న పీసీసీ ఛీప్ షర్మిలా తల్లి విజయమ్మతో కలిసి బుధవారం ఉదయం 9 గంటలకు వైఎస్ఆర్ ఘాట్ వద్దకు వచ్చారు. ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం తల్లి విజయమ్మతో కలిసి తండ్రి వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పించారు.
మరణం లేని మహానేత - వైఎస్ షర్మిలా
వైఎస్ఆర్ను గుర్తుచేసుకుంటూ వైఎస్ షర్మిలా ఎక్స్ వేదికగా పోస్టు కూడా పెట్టారు. 'మరణం లేని మహానేత డాక్టర్ వైఎస్సార్. కోట్లాది ప్రజల గుండెల్లో దివంగత ముఖ్యమంత్రిది ఎన్నటికీ చెరగని స్థానం. నేడు 17వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయ ఘాట్ వద్ద నివాళులు అర్పించి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాను. వైఎస్ఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు నేటికి చెరపని ముద్ర. దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే అధ్యాయం. పేదలకు ఉచిత కార్పొరేట్ వైద్యం అందించిన మహత్తర పథకం ఆరోగ్య శ్రీ. కోట్లాది మంది పేద బిడ్డలకు ఉచిత విద్యను అందించి చదువులకు భరోసా కల్పించిన పథకం ఫీజు రియంబర్స్మెంట్. ఉచిత విద్యుత్ ద్వారా రైతు సంక్షేమానికి, జలయజ్ఞంతో సాగునీటి రంగానికి సరికొత్త నడక నేర్పిన అపర భగీరథుడు వైఎస్ఆర్. 108,104 అంబులెన్స్ సేవలు, రైతులకు వ్యవసాయ రుణాలు మాఫీ లాంటి ఎన్నో పథకాలు నేటికి చిరస్మరణీయం" అని షర్మిలా అన్నారు.
పవర్ స్టార్ బర్త్ డే వేడుకల్లో విషాదం - విద్యుత్ షాక్తో అభిమాని మృతి
Author : Satyaprasad Bandaru


