Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Yuktha Malnad: యాక్టింగ్ వద్దన్న అమ్మ.. ఎయిర్ హోస్టెస్ జాబ్ వదిలేసి.. కలవారి కోడలు 'కనకమహాలక్ష్మి' రియల్ లైఫ్ విషయాలు

Yuktha Malnad: యాక్టింగ్ వద్దన్న అమ్మ.. ఎయిర్ హోస్టెస్ జాబ్ వదిలేసి.. కలవారి కోడలు 'కనకమహాలక్ష్మి' రియల్ లైఫ్ విషయాలు

ABP దేశం 1 week ago

Yuktha Malnad: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తుంది కన్నడ బ్యూటీ యుక్త మల్నాడు (Yuktha Malnad). ప్రస్తుతం జీ తెలుగు, ఇతర రీజినల్ ఛానల్స్లో నటిస్తూ ఈమె మంచి క్రేజ్ సంపాదించుకుంటోంది.

జీ తెలుగులో ప్రసారం అవుతున్న 'కలవారి కోడలు కనకమహాలక్ష్మి' సీరియల్లో యుక్త ప్రధాన పాత్ర అయిన 'కనకమహాలక్ష్మి'గా నటిస్తోంది. యుక్త కెరీర్, రెమ్యూనరేషన్, ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.

సీరియల్ కెరీర్

యుక్త తన గ్లామర్, నేచురల్ యాక్టింగ్తో చాలా తక్కువ సమయంలోనే బుల్లితెర ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఈమె తన కెరీర్ను మొదట కన్నడ సీరియల్స్ ద్వారా స్టార్ట్ చేసింది. అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్నాక.. తెలుగు టెలివిజన్ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. వైదేహి పరిణయం సీరియల్తో యుక్త తెలుగు బుల్లితెరకు పరిచయం అయ్యింది. జీ తెలుగులో ప్రసారమవుతున్న "కలవారి కోడలు కనకమహాలక్ష్మి" సీరియల్ ద్వారా ఈమె తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇందులో ఈమె నటనకు, స్క్రీన్ ప్రెజెన్స్కు మంచి మార్కులు పడుతున్నాయి. తెలుగుతో పాటు ఇటీవల కాలంలో యుక్త తమిళ టెలివిజన్ రంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా వరుస ప్రాజెక్ట్లతో దూసుకుపోతోంది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు: సాగర్ కూలీగా ధీరజ్..! ఆ పని ఒప్పుకోవడానికి కారణమేంటి? వేరు కాపురం.. కొత్త సారె!

రెమ్యూనరేషన్

బుల్లితెరపై కొత్తగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ, యుక్త తన గ్లామర్, సోషల్ మీడియా ఫాలోయింగ్తో మంచి పారితోషికమే అందుకుంటుంది. ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్ ప్రకారం, లీడ్ రోల్స్ చేస్తున్నందుకు యుక్త రోజుకు రూ.10,000 నుంచి రూ.15,000 వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. సీరియల్ సక్సెస్, పాపులారిటీని బట్టి రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే ఛాన్స్ ఉంది.

ఆసక్తికరమైన విషయాలు

యుక్త గురించి చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, యాక్టింగ్ స్టార్ట్ చేయకముందు యుక్త ఒక ప్రముఖ ఎయిర్లైన్స్లో ఎయిర్ హోస్టెస్గా పనిచేసింది. మంచి శాలరీ వచ్చే జాబ్ అయినప్పటికీ, యాక్టింగ్పై ఉన్న ఇష్టంతో ఆ జాబ్ను వదిలేసి టెలివిజన్ ఇండస్ట్రీలోకి వచ్చింది. యుక్త యాక్టింగ్ వైపు రావడం వాళ్ల అమ్మగారికి మొదట్లో అస్సలు ఇష్టం లేదట. కుటుంబంలో ఎవరూ ఈ ఫీల్డ్లో లేరు, చదువు పూర్తి చేసి మంచి ఉద్యోగం చూసుకో అని ఆమె చెప్పేవారట. కానీ యుక్త పట్టుబట్టి నటన వైపు వచ్చి, ఇప్పుడు తన టాలెంట్తో ఇంట్లో వాళ్లను ఒప్పించింది.

'గోదావరి' సీరియల్: సూర్య జానుని లవ్ చేస్తున్నాడు అని భువనకి తెలిసిపోయిందా! మురళీ శంకర్ కాళ్లు పట్టడానికి కారణమేంటి?

సోషల్ మీడియాలో యాక్టివ్

యుక్త మల్నాడ్ ఇన్స్టాగ్రామ్(yukthamalnadofficial)లో చాలా యాక్టివ్గా ఉంటుంది. ట్రెండీ రీల్స్, ఫొటోషూట్స్ షేర్ చేస్తూ అభిమానులతో ఎప్పుడూ టచ్లో ఉంటుంది. ముఖ్యంగా ఈమె క్యూట్ ఎక్స్ప్రెషన్స్కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.

మంచి డ్యాన్సర్

చిన్నప్పటి నుంచి సీరియల్స్, సినిమాలు చూస్తూ నటించాలని కోరికను పెరిగిందని యుక్త చెప్పింది. డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే ఓ ఈవెంట్లో తాను చేసిన డ్యాన్స్ కి అక్కడికి వచ్చిన ఓ డైరెక్టర్ ఫిదా అయ్యారట. తన సినిమాలో ఛాన్స్ ఇస్తానని అన్నారట. చదువు అయిపోయిన తర్వాత చూద్దాంలేనని అప్పట్లో ఆ ఆఫర్ని రిజెక్ట్ చేసిందట. చదువు అయిపోయిన తర్వాత స్పైస్ జెట్లో ఎయిర్ హోస్టెస్గా పనిచేస్తున్న సమయంలో మళ్లీ సినిమా ఆఫర్ రావడంతో ఆ జాబ్ను వదిలేశానని చెప్పింది. అలా మంచి జాబ్ ని వదిలేసి సినిమా అంటే ఇష్టంతో నటన వైపు అడుగులు వేశానని యుక్త తెలిపింది.

నిండు మనసులు: మంజులని ఆఫీస్కి రప్పిస్తున్న సిద్ధూ! విజయానంద్ ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందేనా!

Author : Satyaprasad Bandaru

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam