Dailyhunt

అల్లు స్నేహ..మరోసారి వార్తల్లో!

కాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. తాజాగా ఆమె తన ఏప్రిల్ నెలకు సంబంధించిన అందమైన జ్ఞాపకాలను ఫోటోల రూపంలో అభిమానులతో పంచుకున్నారు.

ఈ ఫోటో గ్యాలరీలో అల్లు అర్జున్, పిల్లలు అల్లు అయాన్, అల్లు అర్హలతో గడిపిన సరదా క్షణాలు హైలైట్‌గా నిలిచాయి. ఏప్రిల్ నెలలో జరిగిన సెలబ్రేషన్స్, సమ్మర్ వెకేషన్ మూమెంట్స్ మరియు పిల్లల అల్లరిని ప్రతిబింబించేలా ఈ ఫోటోలు ఉన్నాయి.

అర్హ-అయాన్ …పిల్లలిద్దరూ సమ్మర్ వేడిని ఎంజాయ్ చేస్తున్న క్యూట్ ఫోటోలు నెటిజన్ల మనసు గెలుచుకుంటున్నాయి. ఎప్పటిలాగే స్నేహ రెడ్డి తన క్లాసీ అండ్ స్టైలిష్ అవుట్‌ఫిట్స్‌తో మెరిసిపోయారు. సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్‌లో ఆమె కనిపిస్తున్న ఫోటోలు ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.

ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా గడుపుతున్న విజువల్స్ ఈ ఆల్బమ్‌లో ప్రత్యేకంగా నిలిచాయి.స్నేహ రెడ్డి ఈ ఫోటోలను షేర్ చేసిన కొద్ది నిమిషాల్లోనే వేల సంఖ్యలో లైకులు, కామెంట్లు వచ్చి చేరాయి. పర్ఫెక్ట్ ఫ్యామిలీ , అర్హ చాలా క్యూట్‌గా ఉంది , ఏప్రిల్ డైరీస్ అదిరిపోయాయి అంటూ అల్లు ఫ్యాన్స్ కామెంట్లతో ముంచెత్తుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Adya Media Telugu