చంద్రబాబు మీకు 77 ఏళ్ల వయస్సు..ఈ వయస్సులో కూడా ఇలాంటి దౌర్భాగ్యమైన రాజకీయాలు చేయడానికి సిగ్గుగా అనిపించడం లేదా అని ప్రశ్నించారు మాజీ సీఎం వైఎస్ జగన్.
మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ మంచోడు కాబట్టే మా తాత రాజారెడ్డిని నరికి చంపిన వారు ఈరోజుకు కూడా ప్రశాంతంగా ఉన్నారు..
జగన్ చెడ్డవాడు అయ్యి ఉంటే వాళ్లంతా బతికి ఉండేవాళ్లా..? చెప్పాలన్నారు.
జగన్ నైజం ఎలాంటిది.. జగన్ మనస్తత్వం ఎలాంటిది అనేందుకు నిదర్శనం అది..హరికృష్ణ చనిపోతే పరామర్శకు వెళ్లి #KTR తో పొత్తుల గురించి మాట్లాడలేదా..? చెప్పాలన్నారు. శవాన్ని పక్కనపెట్టుకొని పొత్తుల గురించి మాట్లాడిన నీది శవ రాజకీయం కాదా..? అని ప్రశ్నించారు.
చంద్రబాబు ఎవరిది గొడ్డలి పార్టీ..? ఎవరిది గన్ కల్చర్..?…చంద్రబాబు అధికారంలో ఉండగానే నా తాత రాజారెడ్డిని చంపేశారు… మా నాన్నను అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానని చంద్రబాబు అన్న రెండు మూడు రోజులకే హెలికాప్టర్ ప్రమాదం జరిగింది అన్నారు. మా తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంపై ఇంకా నివృత్తి కాని అంశాలున్నాయి… మా చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య చంద్రబాబు అధికారంలో ఉండగానే జరిగింది అన్నారు. చంపినవాడు దస్తగిరి దర్జాగా కారులో తిరుగుతున్నాడు అన్నారు.
దేశంలో కి.మీ రోడ్డు నిర్మాణానికి రూ.24 కోట్లు…అమరావతిలో రోడ్డు నిర్మాణానికి చంద్రబాబు చేస్తున్న రోడ్డు ఖర్చు రూ.53 కోట్లు అని ఆరోపించారు. విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ కి.మీ ఖర్చు రూ.69 కోట్లు… సీడ్ యాక్సిస్ నుంచి చంద్రబాబు నిర్మిస్తున్న ఫ్లైఓవర్‌కు కి.మీ రూ.189 కోట్లు అన్నారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్.. స్క్రిప్టు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చూస్తేనే ఉన్నాం… ఏ విషయంలోనైనా గట్టిగా ఎవరైనా నిలదీస్తే నాపై, వైసీపీపై అడ్డగోలు ఆరోపణలతో టాపిక్ డైవర్షన్… రెండేళ్లుగా ఈ సినిమా చూస్తూనే ఉన్నాం అన్నారు. రెండేళ్ల చంద్రబాబు పరిపాలన " బాబు ష్యూరిటీ - మోసం గ్యారంటీ "…ఇదే చంద్రబాబు రెండేళ్ల పరిపాలన ప్రోగ్రెస్ అని ఎద్దేవా చేశారు.
