Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భార్యను హత్య చేసి.. ఫ్యానుకు ఉరి వేసి..

భార్యను హత్య చేసి.. ఫ్యానుకు ఉరి వేసి..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మద్యానికి బానిసైన భర్త తన భార్యను హత్య చేసి అది ఆత్మహత్య అని నమ్మించేందుకు ప్రయత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

ఈ కేసులో నిందితుడైన కిలారు బాలకృష్ణను పోలీసులు అరెస్టు చేశారు.

నిందితుడు కిలారు బాలకృష్ణ నిత్యం మద్యం సేవిస్తూ భార్య భార్గవిని వేధించేవాడు. భర్త అలవాటును మార్చుకోవాలని భార్గవి పదేపదే కోరుతుండేది. ఇదే విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. పది రోజుల క్రితం కూడా వీరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మద్యం మానేయాలని చెప్పిన భార్గవిపై ఆగ్రహంతో బాలకృష్ణ ఆమెను హత్య చేశాడు.

భార్గవిని హత్య చేసిన తర్వాత బాలకృష్ణ ఆమె మృతదేహాన్ని ఫ్యానుకు ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఇది ఆత్మహత్య అని అందరినీ నమ్మించేందుకు ప్రయత్నించాడు. అయితే మృతురాలి సోదరుడు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి తమదైన శైలిలో విచారణ చేపట్టారు.

పోలీసుల విచారణలో నిందితుడు బాలకృష్ణ తన నేరాన్ని అంగీకరించాడు. మద్యాన్ని మానేయాలని చెప్పినందుకే భార్గవిని చంపినట్లు అతను ఒప్పుకున్నాడు. దీనితో పోలీసులు గతంలో నమోదు చేసిన ఆత్మహత్య కేసును హత్య కేసుగా మార్చారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండుకు తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Adya Media Telugu