ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పులివెందుల వేదికగా మరోసారి మాటల యుద్ధం పీక్స్‌కు చేరింది. తెలుగుదేశం పార్టీ (TDP) నేత బీటెక్ రవిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి బీటెక్ రవి చేసిన వ్యాఖ్యలపై అవినాష్ రెడ్డి ఘాటుగా స్పందిస్తూ.. నువ్వెంత.. నీ బతుకెంత..? అంటూ బహిరంగంగానే హెచ్చరించారు.
బీటెక్ రవి గతంలో పదవుల కోసం చేసిన బేరసారాలను తెరపైకి తెస్తూ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బీటెక్ రవి రాజకీయ చరిత్రను ప్రస్తావిస్తూ ఎంపీ అవినాష్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఇచ్చిన పదవులను అమ్ముకునే దౌర్భాగ్యపు బతుకు బీటెక్ రవిదంటూ మండిపడ్డారు. మేము అధికారంలో ఉన్న సమయంలో.. నువ్వు విజయసాయిరెడ్డి ఇంటికి వచ్చి ఎమ్మెల్సీ పదవిని రూ. 12 కోట్లకు బేరం పెట్టలేదా..? అని అవినాష్ రెడ్డి ప్రశ్నించారు.
వైసీపీ కండువా కప్పుకుంటానన్నావు: ఎమ్మెల్సీ పదవిని అమ్మేస్తానని, ఆ డీల్‌కు ఒప్పుకుంటే వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకుంటానని స్వయంగా బీటెక్ రవే ప్రతిపాదించాడని ఆయన ఆరోపించారు. ప్రజలు ఇచ్చిన గౌరవాన్ని అమ్ముకునే వ్యక్తి.. ఈ రోజు ఉద్దేశపూర్వకంగా వైఎస్ జగన్‌ను నోటికొచ్చినట్లు మాట్లాడటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బీటెక్ రవిని హెచ్చరించారు.
బీటెక్ రవి బతుకేంటో జిల్లా ప్రజలందరికీ తెలుసు. ప్రజలు ఇచ్చిన పదవిని అమ్ముకునే దౌర్భాగ్యమైన బతుకు నీది… అలాంటి నువ్వు మా నాయకుడు జగన్‌ని నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోం… నోరు జాగ్రత్తగా పెట్టుకో అని వైఎస్ అవినాష్ తెలిపారు.

