చంద్రబాబు మాటలు నమ్మి తల్లిదండ్రులు ఎవరూ మోసపోవద్దు అన్నారు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. మీడియాతో మాట్లాడిన రాచమల్లు..
ఎక్కువ మంది పిల్లల్ని కంటే ప్రభుత్వం ఇచ్చే నజరానా కేవలం ఆ కాన్పు ఖర్చులకే సరిపోతుంది అన్నారు.
అదనంగా కనే సంతానానికి ప్రభుత్వం రూ. 50 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలి.. ప్రతి ఏటా రూ. లక్ష ఆర్థిక సాయం అందించాలి అని డిమాండ్ చేశారు. అలాగే వారి అర్హతను బట్టి ఉద్యోగం ఇచ్చేలా జీవో (GO) విడుదల చేయాలి అన్నారు.
జీవోకు శాశ్వత గ్యారెంటీ ఉండాలి.. ఆ జీవో భవిష్యత్తులో ప్రభుత్వాలు మారినా కూడా చెల్లుబాటు అయ్యేలా చట్టబద్ధమైన గ్యారెంటీ ఇవ్వాలి అని రాచమల్లు శివప్రసాద్ తెలిపారు.
