Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

చంద్రబాబు పొదుపు మంత్రం..మాటలకేనా?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకవైపు పొదుపు చర్యలు పాటించాలని కేబినెట్ వేదికగా నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి మరియు మంత్రుల పర్యటనలు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పుట్టపర్తి పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.

నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రభుత్వ ఖర్చులను తగ్గించాలని, దుబారాను అరికట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ఇకపై మంత్రులు ప్రత్యేక విమానాల్లో ప్రయాణించకూడదని మంత్రి పార్ధసారధి కూడా మీడియా వేదికగా ప్రకటించారు. అయితే, ఈ ప్రకటన వచ్చిన కొద్దిసేపటికే మంత్రి నారా లోకేష్ VT-CVB కోడ్ కలిగిన ప్రత్యేక విమానంలో శ్రీ సత్యసాయి జిల్లాకు చేరుకోవడం చర్చకు దారితీసింది.

సభకు జనాన్ని తరలించేందుకు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సులు మరియు స్కూల్ బస్సులను వినియోగించారు. పుట్టపర్తి నుండి ధర్మవరం వరకు మంత్రి లోకేష్ భారీ కాన్వాయ్‌తో వెళ్లడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కూడా ప్రత్యేక విమానంలోనే పుట్టపర్తికి చేరుకున్నారు.

ఒకవైపు రాజకీయ విమర్శలు ఉన్నప్పటికీ, జిల్లాలో ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు అడుగులు పడ్డాయి. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి బ్రాహ్మణపల్లి వద్ద అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ (AMCA) డిఫెన్స్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. 650 ఎకరాల భారీ స్థలంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సుమారు రూ. 15,803 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. యుద్ధ విమానాల ఇంటిగ్రేషన్, టెస్టింగ్, వాలిడేషన్ మరియు సర్టిఫికేషన్ కోసం ఒక అత్యాధునిక టెస్టింగ్ సెంటర్‌ను ఇక్కడ నిర్మిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Adya Media Telugu