Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీ) వ్యతిరేకంగా విపక్ష 'ఇండియా' కూటమి ఎంపీలు ఆందోళన చేపట్టారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. అనుమతి లేదంటూ పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, ప్రతిపక్ష ఎంపీలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పలువురు విపక్ష ఎంపీలను అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె రోడ్డుపైనే పడుకుని నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు తమపై దౌర్జన్యం చేస్తున్నారని ఎంపీలు ఆరోపించారు. ఈసీని కలవడం నేరమా అని వారు ప్రశ్నించారు.

అంతకుముందు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో విపక్ష నేతల భేటీ ముగిసింది. అనంతరం ఎంపీలంతా కలిసి ఈసీ కార్యాలయం వైపు ర్యాలీగా బయలుదేరారు. దీంతో జన్ పథ్ పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని నాశనం చేస్తోందని ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు హక్కు పరిరక్షణ కోసం ఎన్ని కేసులు పెట్టినా పోరాటం ఆపేది లేదని ఆయన స్పష్టం చేశారు.

సీఈసీ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. నిన్న ఈసీని కలిసేందుకు వెళ్తే పోలీసులు అడ్డుకున్నారని ఆయన గుర్తుచేశారు. తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ తనకు మెడల్‌తో సమానమని రాహుల్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ ఉద్యమం కొనసాగుతుందని కాంగ్రెస్ నేతలు తేల్చిచెప్పారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Adya Media Telugu