Dailyhunt
ఎన్టీఆర్-నీల్‌..పుకార్లకు పుల్‌స్టాప్!

ఎన్టీఆర్-నీల్‌..పుకార్లకు పుల్‌స్టాప్!

జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్‌పై ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన వదంతులకు చిత్రబృందం చెక్ పెట్టింది.

హీరో లుక్ నచ్చకపోవడంతో పూర్తి షెడ్యూల్‌ను రద్దు చేశారనే ప్రచారాన్ని నిర్మాణ సంస్థలు ఖండించాయి.

నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా స్పందిస్తూ, సినిమా షూటింగ్ పూర్తిగా ప్లాన్ ప్రకారమే కొనసాగుతోందని స్పష్టం చేశాయి. ప్రస్తుతం ఉన్న విరామం ఏదైనా సమస్య వల్ల కాదు, సాధారణ ప్రిపరేషన్ గ్యాప్ మాత్రమేనని తెలిపారు.

ఈ ప్రకటనతో సోషల్ మీడియాలో వైరల్ అయిన వదంతులు పూర్తిగా తప్పని తేలిపోయాయి. అభిమానుల్లో నెలకొన్న ఆందోళన కూడా తగ్గింది. అయితే, సినిమా విడుదల తేదీపై మాత్రం అనిశ్చితి నెలకొంది. ముందుగా అనుకున్న జూన్ 25 విడుదల తేదీ ఇప్పుడు కాస్త సందేహాస్పదంగా కనిపిస్తోంది. ఇంకా చాలా భాగం షూటింగ్ మిగిలి ఉండటం, ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభం కాకపోవడంతో విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Adya Media Telugu