ఏపీ ఆర్థిక పరిస్థితిపై మాజీ సీఎం జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని పూర్తిగా సంక్షోభంలోకి తీసుకెళ్లారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు విధానాలు, అవినీతి వల్లే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది అంటూ ట్వీట్ చేశారు.
కానీ అభివృద్దిలో దూసుకుపోతున్నామంటూ అబద్దపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల దృష్టిని మరల్చటానికే అభివృద్ది, సంపద సృష్టి అంటూ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
ఈ ఏడాది రాష్ట్ర డీఎస్డీపీ వృద్దిరేటు 10.75 శాతం నమోదయిందంటున్నారు… 2025-26 ఆర్థిక సంవత్సరపు కాగ్ నివేదికలు చూస్తే పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది అన్నారు.కానీ చంద్రబాబు మాత్రం ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర డీఎస్డీపీ వృద్దిరేటు 10.75శాతం నమోదయిందంటున్నారు అన్నారు.
నిజానికి రాష్ట్ర ప్రభుత్వపు సొంత పన్ను ఆదాయాలు 3.22 శాతం తగ్గిపోయాయి… ఏదైనా రాష్ట్రం అభివృద్ది చెందుతుందంటే అక్కడ పెట్టుబడులుపెరుగుతాయి..కానీ ఏపీలో 3.22 శాతం తగ్గటం అంటే అర్థం ఏంటి? అని ప్రశ్నించారు.
