సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరులో మరోసారి మహిళా ప్రయాణికురాలికి చేదు అనుభవం ఎదురైంది. తనను గమ్యస్థానానికి చేర్చకుండా, మధ్యలో కారు ఆపమని వేడుకున్నా వినకుండా ఓ క్యాబ్ డ్రైవర్ దురుసుగా ప్రవర్తించాడంటూ ఒక మహిళ సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను పంచుకుంది.
బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె ప్రయాణం మధ్యలో కారును ఆపమని డ్రైవర్‌ను కోరింది. అయితే ఆ డ్రైవర్ కారు ఆపడానికి నిరాకరించడమే కాకుండా, ఆమెతో వాగ్వాదానికి దిగాడు.ఆమె భయపడి ఎవరికైనా ఫోన్ చేస్తానని చెప్పగా, ఆ డ్రైవర్ ఏమాత్రం తగ్గకుండా నువ్వు ఎవరికైనా ఫోన్ చేసుకో.. నేను మాత్రం కారు ఆపను అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు.
డ్రైవర్ ప్రవర్తనతో తీవ్ర భయాందోళనకు గురైన మహిళ, ఆ సమయంలో తనకు ఎదురైన భయానక అనుభవాన్ని వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. బెంగళూరులో క్యాబ్ సేవలు మరియు మహిళల భద్రతపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మరియు క్యాబ్ సంస్థలు ఇటువంటి డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ పోస్ట్‌పై స్పందించిన బెంగళూరు పోలీసులు, సదరు మహిళను వివరాలు తెలియజేయాలని కోరారు. ఘటనపై విచారణ జరిపి నిందితుడైన డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
