హైదరాబాద్ మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందారు. మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామ శివారులోని వ్యాస ఫామ్ హౌస్‌లో జరిగిన బర్త్‌డే పార్టీలో తన స్నేహితులతో పాల్గొన్నారు యువకుడు.
అయితే స్విమ్మింగ్ పూల్‌లో అనుమానాస్పద స్థితిలో పడి మృతి చెందాడు యువకుడు. ఉదయం గమనించి స్నేహితులకు సమాచారం ఇచ్చారు వాచ్ మెన్. యువకుడి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన అధికారులు… మృతుడు హైదరాబాద్ మజీద్ బండకు చెందిన యాక్సిస్ బ్యాంక్ సెకూరిటీ గార్డ్ సాయి(28)గా గుర్తించారు.
