Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

గ్రాండ్‌గా ప్రారంభమైన మెగా158!

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'మెగా158' ఈరోజు హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా ప్రారంభమైంది.

తన అన్నయ్య చిరంజీవి కొత్త సినిమా ఓపెనింగ్ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి సందడి చేశారు.

ఈ ఘనమైన ప్రారంభోత్సవంలో పవన్ కళ్యాణ్ ముహూర్తపు షాట్‌కు క్లాప్‌బోర్డ్ కొట్టడంతో మెగా అభిమానుల కోలాహలం మిన్నంటింది. అనంతరం మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు కలిసి ఈ చిత్ర స్క్రిప్ట్‌ను దర్శకుడు బాబీకి అధికారికంగా అందజేసి ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు.

ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కూతురి పాత్రలో మలయాళ నటి అనస్వర రాజన్ నటిస్తోంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, ప్రియమణి, బాలీవుడ్ దర్శకుడు-నటుడు అనురాగ్ కశ్యప్, మరియు బండ్ల గణేష్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించనున్నట్లు గట్టిగా ప్రచారం సాగుతోంది. ఈ క్రేజీ కాస్టింగ్ రూమర్స్‌పై చిత్ర నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ ప్రతిష్టాత్మక చిత్రం ద్వారా ప్రముఖ నిర్మాణ సంస్థ 'కేవీఎన్ ప్రొడక్షన్స్' భారీ బడ్జెట్‌తో టాలీవుడ్‌లోకి అధికారికంగా అడుగుపెడుతోంది. ఈ చిత్రానికి స్టార్ కంపోజర్ థమన్ (Thaman S) సంగీతాన్ని అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రాఫర్‌గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.ఈ మెగా బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్ త్వరలోనే వెలువడనున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Adya Media Telugu