Dailyhunt

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్..సమ్మర్ క్యాంప్

వేసవి సెలవుల్లో విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడంతో పాటు వారిలో క్రమశిక్షణను పెంపొందించేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది.

నగరంలోని చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఉచిత సమ్మర్ క్యాంప్‌ను నిర్వహిస్తోంది.

గోషామహల్‌లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (TTI)లో నిర్వహించబడుతుంది.11 ఏళ్ల నుండి 17 ఏళ్ల లోపు వయస్సు ఉన్న విద్యార్థులు ఈ శిబిరంలో పాల్గొనవచ్చు.రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నిబంధనలపై ప్రాథమిక అవగాహన కల్పించనున్నారు.

అలాగే సైక్లింగ్ శిక్షణ మరియు రోడ్డుపై పాటించాల్సిన జాగ్రత్తలు, ప్రథమ చికిత్స (First Aid) పద్ధతులపై అవగాహన కల్పించనున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ మరియు సైన్ బోర్డుల అర్థం…పర్యావరణ పరిరక్షణ మరియు సామాజిక బాధ్యత అన్నారు.

చిన్నతనం నుండే రోడ్డు భద్రతా నియమాలను నేర్చుకోవడం వల్ల భవిష్యత్తులో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదుగుతారని ట్రాఫిక్ పోలీసులు భావిస్తున్నారు. సరదాగా గడుపుతూనే కీలకమైన విషయాలను నేర్చుకునేలా ఈ శిబిరాన్ని రూపొందించారు. ఆసక్తి గల విద్యార్థులు లేదా వారి తల్లిదండ్రులు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా నేరుగా సంబంధిత కార్యాలయంలో సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ శిబిరం పూర్తిగా ఉచితం కాబట్టి వీలైనంత ఎక్కువ మంది విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Adya Media Telugu