Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇన్‌స్టాలో రీల్స్..అమ్మాయిల ట్రాప్!

ఇన్‌స్టాలో రీల్స్..అమ్మాయిల ట్రాప్!

న్‌స్టాగ్రామ్‌లో రీల్స్ పెట్టి సంపన్నుల పిల్లలను ట్రాప్ చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు జూబ్లీహిల్స్ పోలీసులు.

ముఠాలోని కీలక సభ్యుడు కోడూరి చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్ (23)ను ఇప్పటికే అరెస్ట్ చేశారు పోలీసులు.

తెలుగు రాష్ట్రాల్లో రెండేళ్ల వ్యవధిలో ఇలా అతడి చేతిలో మోసపోయారు 20 మందికి పైగా బాలికలు. అర్జున్‌తో పాటు అతని సోదరుడు రాజీవ్‌ను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మాయిలను ట్రాప్ చేసి డబ్బులు వసూలు చేశారు ఆజాద్, రాజీవ్. ప్రేమ, పెళ్లి పేరుతో సంపన్నుల పిల్లలను ట్రాప్ చేస్తున్నారు. పదిమంది సభ్యులతో ముఠాను ఏర్పాటు చేసి డబ్బులు వసూలు చేశారు ఆజాద్, రాజీవ్.

బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లోని సంపన్నుల పిల్లలను టార్గెట్ చేశారు ఆజాద్, రాజీవ్. ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెను ట్రాప్ చేసి 13 లక్షలు వసూలు చేశారు. దీంతో పోక్సో కేసులో అర్జున్‌ను అరెస్ట్ చేయడంతో పాటు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Adya Media Telugu