సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా బ్లాక్‌బస్టర్ హిట్ 'జైలర్'కు సీక్వెల్‌గా వస్తున్న 'జైలర్ 2' పై అంచనాలు భారీగా ఉన్నాయి. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావోచ్చింది.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా విడుదల తేదీ గురించి సోషల్ మీడియాలో ఒక క్రేజీ అప్‌డేట్ చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే చిత్ర యూనిట్ అధికారికంగా విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.
కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, మలయాళ స్టార్ మోహన్‌లాల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.వీరితో పాటు ఎస్.జె. సూర్య, రమ్యకృష్ణ, మిర్నా మీనన్ మరియు యోగి బాబు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.సన్ పిక్చర్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. మొదటి భాగం మ్యూజికల్‌గా పెద్ద హిట్ అవ్వడంతో, ఈసారి అనిరుధ్ ఎలాంటి మ్యాజిక్ చేస్తారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

