Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కన్న కూతురులా చూడాల్సిన బాబాయే.. హత్య చేసి..

కన్న కూతురులా చూడాల్సిన బాబాయే.. హత్య చేసి..

త్తరప్రదేశ్‌లోని బరేలీలో అత్యంత అమానుష ఘటన చోటుచేసుకుంది. ప్రేమించిన పాపానికి కన్న కూతురులా చూడాల్సిన బంధువే కామాంధుడిగా మారి బాలిక ప్రాణం తీశాడు.

ఈ దారుణం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

బరేలీలో పదో తరగతి చదువుతున్న ఓ బాలిక, పక్కింటి యువకుడిని ప్రేమిస్తోందని తెలుసుకున్న ఆమె బాబాయ్ జయప్రకాశ్ ఆమెను తీవ్రంగా మందలించాడు. ఆ అబ్బాయికి దూరంగా ఉండాలని గట్టిగా హెచ్చరించినా, ఆ బాలిక రహస్యంగా ఫోన్‌లో మాట్లాడటం మాత్రం ఆపలేదు.

ఈ విషయంపై తీవ్ర కోపోద్రిక్తుడైన బాబాయ్ జయప్రకాశ్ ఆ బాలికను బలవంతంగా స్థానిక పొలాల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యంత కిరాతకంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ఆమె కాళ్లకు ఏకంగా ఆరు ఇనుప మేకులు కొట్టి, సుమారు 8 అడుగుల లోతులో బాలిక మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా పాతిపెట్టాడు.

గత జూలై 28వ తేదీ నుంచి ఆ బాలిక కనిపించకపోవడంతో ఆందోళన చెందిన ప్రియుడు, ఘటన జరిగిన 22 రోజుల తర్వాత పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా, కుటుంబ సభ్యులే ఈ అపరాధంలో ప్రమేయం ఉన్నట్లు అనుమానించారు.

ఈ క్రమంలో పోలీసులు తమదైన శైలిలో కుటుంబ సభ్యులను విచారించగా, బాలిక బాబాయ్ జయప్రకాశ్ అసలు నిజం ఒప్పుకున్నాడు. తానే స్వయంగా ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అంగీకరించాడు. నిందితుడు జయప్రకాశ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Adya Media Telugu