Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

మహేష్‌కు భాష రాదు.!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గతంలో చేసిన బాలీవుడ్ నన్ను భరించలేదు అనే వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారమే రేపాయి. తాజాగా మహేష్ బాబు నటించిన 'టక్కరి దొంగ' చిత్రంలో ప్రతినాయకుడిగా నటించిన ప్రముఖ నటుడు రాహుల్ దేవ్, ఈ వ్యాఖ్యలపై ఆసక్తికరమైన వివరణ ఇచ్చారు.

మహేష్ బాబుకు హిందీ రాదని, అందుకే ఆయన అలా అని ఉండవచ్చని రాహుల్ దేవ్ అభిప్రాయపడ్డారు. వాళ్లకు భాష (హిందీ) రాదు. అది ఒక ప్రధాన కారణం కావచ్చు అని పేర్కొన్నారు. దక్షిణాది నటులు తమ పరిశ్రమలో పొందే గౌరవం, పారితోషికం మరియు అక్కడ ఉండే పని వాతావరణం పట్ల చాలా సంతృప్తిగా ఉంటారని, అందుకే వారు బాలీవుడ్ వైపు పెద్దగా మొగ్గు చూపరని రాహుల్ వివరించారు.

మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలు అహంకారంతో అన్నవి కాదని, తనను అంతగా ప్రేమిస్తున్న తెలుగు ప్రేక్షకులను వదిలి హిందీలోకి రావడం తనకు ఇష్టం లేదనే ఉద్దేశ్యంతో అన్నవని ఆయన సమర్థించారు.

రాహుల్ దేవ్ స్వతహాగా బాలీవుడ్ నటుడైనప్పటికీ, టాలీవుడ్‌లో అనేక చిత్రాల్లో నటించారు. దక్షిణాది సినిమాల్లో నటులకు లభించే క్రమశిక్షణ, నిర్మాతలు ఇచ్చే పారితోషికం బాలీవుడ్‌తో పోలిస్తే చాలా మెరుగ్గా ఉంటాయని ఆయన పలు సందర్భాల్లో ప్రశంసించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Adya Media Telugu