హైదరాబాద్‌లో అమానుషం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. వీడియో తీసి పలుమార్లు బాలికను బ్లాక్మెయిల్ చేసిన నిందితులపై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు.
హైదరాబాద్ - దుండిగల్ ప్రాంతంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల సమీపంలోని ఓ షామియానా దుకాణంలో పనిచేస్తూ రోజూ అటు వైపు నుండి వెళ్తున్న బాలికపై కన్నేశాడు శివకుమార్ అలియాస్ మట్టు(20) అనే యువకుడు.
ఒకరోజు బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి ఆమెపై అత్యాచారానికి పాల్పడి, ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు శివకుమార్. బాలిక మౌనంగా ఉండడాన్ని అదునుగా చేసుకుని తన స్నేహితుడు నిజాంపేట రాము(30)తో కలిసి బాలికపై అత్యాచారానికి పాల్పడి, ఫొటోలు వీడియోలు తీసి, ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని బెదిరించారు శివకుమార్.
దీంతో నిందితుల నుండి వరుస వేదింపులు తాళలేక తల్లిదండ్రులకు జరిగిన దుర్ఘటన గురించి బాధితురా వివరించింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసి నిందితులను రిమాండుకు తరలించారు పోలీసులు.
