Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

మృతదేహంతో రోడ్డుపైనే మాజీ ఎమ్మెల్యే ధర్నా

తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ పరిధిలోని జంబుపట్నంలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.మట్టి లోడ్‌తో అతివేగంగా వచ్చిన ఒక టిప్పర్ లారీ బైక్‌ను బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో నొక్కి రాజు వర్మ (27) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వైసిపి నేత, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, వైసిపి నాయకులు ఘటన స్థలానికి చేరుకుని ధర్నాకు దిగారు.

రాత్రివేళల్లో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతూ, మితిమీరిన వేగంతో లారీలు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ మృతదేహంతో రోడ్డుపైనే బైఠాయించి ధర్నాకు దిగారు.ఈ నేపథ్యంలో కోరుకొండ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Adya Media Telugu