Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

నాపై క్షుద్ర పూజలు చేయించారు..!

కోలీవుడ్ స్టార్ హీరో, 'జెయం' రవి (రవి మోహన్) తన వైవాహిక జీవితం, విడాకుల వివాదంపై సంచలన ప్రెస్ మీట్ నిర్వహించారు. తన మాజీ భార్య ఆర్తి, ఆమె కుటుంబ సభ్యులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

చెన్నైలో జరిగిన ఈ ప్రెస్ మీట్‌లో రవి అత్యంత భావోద్వేగానికి గురై, కన్నీటి పర్యంతమయ్యారు. తనకు విడాకులు వచ్చే వరకు సినిమాల్లో నటించబోనని, సినిమాల విడుదలను కూడా నిలిపివేస్తున్నట్లు షాకింగ్ ప్రకటన చేశారు.

ఈ ప్రెస్ మీట్‌లో జయం రవి ఊహించని నిజాలను బయటపెట్టారు. "నాపై వారు క్షుద్ర పూజలు చేయించారు. దాని ప్రభావం వల్ల నేను తీవ్ర అనారోగ్యానికి గురై, రక్తపు వాంతులు కూడా చేసుకున్నాను. గత 14 ఏళ్ల వైవాహిక జీవితంలో నేను ఒక భర్తలా కాదు, ఒక బానిసలా బతికాను. నాకంటూ ఎలాంటి స్వేచ్ఛ లేకుండా చేశారు" అని రవి ఆవేదన వ్యక్తం చేశారు.

తమ పిల్లల ప్రస్తావన రాగానే జయం రవి భావోద్వేగాన్ని ఆపుకోలేక ఏడ్చేశారు. నా పిల్లలకు నన్ను నేను కనపడనీయకుండా చేస్తున్నారు. స్కూల్ దగ్గరకు వెళ్లినా బాడీగార్డులను పెట్టి నన్ను అడ్డుకుంటున్నారు. నా పిల్లలను నేను ఎలా వదిలిపెట్టగలను? వారి భవిష్యత్తు కోసమే నేను ఈ పోరాటం చేస్తున్నాను. నా తల్లిదండ్రులు ఈ పెళ్లి వద్దని ముందే చెప్పారు.. కానీ నేను వినకుండా తప్పు చేశాను అని కన్నీరు పెట్టుకున్నారు.

నేను రాత్రింబవళ్లు కష్టపడి సంపాదించిన కోట్లాది రూపాయల ఆస్తులన్నింటినీ నా భార్య, ఆమె కుటుంబమే ఉంచుకుంది. నన్ను ఒంటిచేత్తో, కట్టుబట్టలతో ఇంటి నుండి బయటకు గెంటేశారు. నా వద్ద కనీసం వాలెట్, కారు, ముఖ్యమైన పత్రాలు కూడా లేకుండా చేశారు. నేను చనిపోతే వాళ్లు సంతోషిస్తారు అని రవి సంచలన ఆరోపణలు చేశారు.

తనకు కష్టకాలంలో తోడుగా నిలిచిన సింగర్ కెనీషా ఫ్రాన్సిస్ గురించి కూడా రవి మాట్లాడారు. "నా జీవితం నాశనమయ్యాక కెనీషా నాకు మానసిక స్థైర్యాన్ని ఇచ్చింది. కానీ ఈ వివాదాల వల్ల విసిగిపోయి ఇప్పుడు వాళ్లు కెనీషాను కూడా దూరం చేశారు (ఆమె బ్రేకప్ చెప్పుకుంది). ఇదంతా ఒక 'మూడక్షరాల ఇడ్లీ నటి' వల్లే జరిగింది. ఆమె నా జీవితాన్ని నాశనం చేసింది. సమాజంలో ఫేక్ ఫెమినిజం ముసుగు వేసుకుని తిరుగుతున్న ఆ నటికి నా గురించి మాట్లాడే అర్హత లేదు. ఆమె ఇప్పటికే ఎన్నో కుటుంబాలను కూల్చేసింది" అంటూ పేరు చెప్పకుండా ఒక ప్రముఖ నటిపై జయం రవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

నాపై జరుగుతున్న ఈ డిజిటల్ దాడిని, అవమానాలను నేను తట్టుకోలేకపోతున్నాను. నా వ్యక్తిగత జీవితం ఒక కొలిక్కి వచ్చే వరకు, నాకు కోర్టు ద్వారా విడాకులు మంజూరయ్యే వరకు నేను ఏ సినిమాలోనూ నటించను. నా సినిమాలు దేనినీ విడుదల చేయనివ్వను అని జయం రవి స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Adya Media Telugu