గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ పుట్టినరోజు (మే 20) సమీపిస్తుండటంతో, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న #NTRNeel చిత్రం గురించి ఒక కీలక వార్త బయటకు వచ్చింది.
ఈ చిత్ర టీజర్‌ను మే 20న విడుదల చేసేందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ప్రశాంత్ నీల్ తన సినిమాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన టీజర్ పనులను ఆయన అత్యంత రహస్యంగా ఉంచినట్లు సమాచారం. ఈ టీజర్ ద్వారా సినిమా నేపథ్యం మరియు ఎన్టీఆర్ లుక్ గురించి ఒక చిన్న హింట్ ఇవ్వబోతున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో, ఆ రోజున భారీ సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ టీజర్ కేవలం ఎన్టీఆర్ అభిమానులకే కాకుండా, యావత్ సినీ ప్రపంచానికి ఒక ఐ-ఫీస్ట్‌లా ఉంటుందని సమాచారం. 'సలార్', 'కేజీఎఫ్' వంటి చిత్రాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన నీల్, ఎన్టీఆర్‌ను ఎలాంటి పవర్‌ఫుల్ పాత్రలో చూపిస్తారో అన్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది.
మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌ను నిర్మిస్తున్నాయి.
