మెన్షన్ హౌస్ మల్లేష్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో మరో కొత్త వేదిక ద్వారా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. బాల సతీష్ దర్శకత్వంలో శ్రీనాథ్ మాగంటి, గాయత్రి రమణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా' (Aha Video) లో మే 22, 2026 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
బోల్డ్ కథాంశం, పక్కా పల్లెటూరి మాస్ హ్యూమర్, డబుల్ మీనింగ్ కామెడీతో థియేటర్లలో విడుదలైన సమయంలోనే ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ సినిమా కథ అంతా ఒక వినూత్నమైన పాయింట్ చుట్టూ తిరుగుతుంది. ఒక పల్లెటూరి వ్యాపారస్థుడికి కొత్తగా పెళ్లవుతుంది. అయితే, శోభనం రాత్రి అతనికి ఎదురైన ఒక వ్యక్తిగత సమస్య.. చూస్తూ చూస్తూనే ఊరంతా హాట్ టాపిక్‌గా మారుతుంది. ఆ తర్వాత తన పెళ్లి బంధాన్ని కాపాడుకోవడానికి, ఊరిలో పోయిన తన పరువును తిరిగి దక్కించుకోవడానికి ఆ యువకుడు పడిన పాట్లు, ఆ క్రమంలో జరిగే గందరగోళం, ఫ్యామిలీ డ్రామా మరియు వ్యంగ్యాస్త్రాల కలబోతగా ఈ సినిమా సాగుతుంది.
ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతూ మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం, ఇప్పుడు మరింత మంది తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యేందుకు 'ఆహా' లోకి వస్తోంది.అడల్ట్ హ్యూమర్, పల్లెటూరి కామెడీని ఇష్టపడే వారికి ఈ వారాంతంలో 'మెన్షన్ హౌస్ మల్లేష్' ఒక డిఫరెంట్ ఎంటర్‌టైనర్‌గా నిలవనుంది.
