Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

'పెద్ది' కోసం అందుకే కష్టపడ్డ!

టీవలే విడుదలైన 'పెద్ది' సినిమా ట్రైలర్‌లో రామ్ చరణ్ లుక్స్ అందరినీ మంత్రముగ్ధులను చేశాయి. ఈ సినిమాలో క్రికెటర్‌గా మరియు ఫెహిల్వాన్ (కుస్తీ యోధుడు) గా రెండు విభిన్నమైన శారీరక లుక్స్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ముఖ్యంగా చరణ్ 'ఫెహిల్వాన్' లుక్ సోషల్ మీడియాను షేక్ చేయడమే కాకుండా, జిమ్‌కి వెళ్లి కష్టపడాలనేలా నేటి యువతకు భారీ ఫిట్‌నెస్ ఇన్‌స్పిరేషన్‌గా నిలిచింది.

ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో రామ్ చరణ్ మరియు దర్శకుడు బుచ్చిబాబు సానాతో కలిసి సినిమా గురించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ.. తాను ఈ సినిమా కోసం ఇంతలా కష్టపడటానికి గల అసలు కారణాన్ని పంచుకున్నారు. బుచ్చిబాబు.. స్టార్ డైరెక్టర్ సుకుమార్ అసిస్టెంట్ అనో, లేదా ఆయన మొదటి సినిమా 'ఉప్పెన' పెద్ద హిట్ అయిందనో తాను ఇంతలా శ్రమించలేదని, కేవలం 'పెద్ది' కథపై ఉన్న ఇష్టంతోనే ఇదంతా చేశానని చరణ్ స్పష్టం చేశారు.

నిజం చెప్పాలంటే.. నువ్వు సుకుమార్ అసిస్టెంట్‌వి అనో, లేదా నువ్వు 'ఉప్పెన' లాంటి బ్లాక్‌బస్టర్ సినిమా తీశావు అనో నేను ఈ బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ కోసం ఇంతగా కష్టపడలేదు బుచ్చి…స్క్రిప్ట్‌తో పూర్తిగా ప్రేమలో పడ్డాను. ఈ సినిమా కోసం నేను ఎంత చేసినా తక్కువే అనిపిస్తుంది. నువ్వు ఈ కథను అంత అద్భుతంగా రాశావు. ఆ సబ్జెక్ట్ లో ఉన్న పవరే నా చేత ఈ కఠిన శ్రమ చేయించింది అని చెప్పుకొచ్చారు చరణ్. పాన్ ఇండియా లెవల్లో భారీ స్ధాయిలో జూన్ 4న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Adya Media Telugu