Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'పెద్ది' టికెట్ ధరల పెంపు.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు!

'పెద్ది' టికెట్ ధరల పెంపు.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది.

ఈ సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు.. ఒక రోజు ముందే ప్రత్యేక షోలు వేసుకునేందుకు ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇచ్చింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్ జీవో విడుదల చేశారు.

ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. సినిమా విడుదలయ్యే జూన్ 4 నుంచి జూన్ 10 వరకు (మొదటి వారం రోజుల పాటు) ప్రస్తుతం ఉన్న సాధారణ టికెట్ ధరలపై సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 100 చొప్పున.. మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ. 125 చొప్పున అదనంగా పెంచుకోవచ్చు. వీటితో పాటు వారం రోజుల పాటు రోజుకు 5 ఆటలు (షోలు) ప్రదర్శించుకునేందుకు కూడా వీలు కల్పించారు. ఇక సినిమా విడుదల కంటే ఒక రోజు ముందే అంటే జూన్ 3 రాత్రి 8 గంటల నుంచి ప్రత్యేక ప్రీమియర్ షోలను ప్రదర్శించుకోవడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ స్పెషల్ షోల టికెట్ ధరను జీఎస్‌టీతో కలిపి రూ. 600 గా నిర్ణయించారు.

ఇటీవల కాలంలో వచ్చిన కొన్ని భారీ చిత్రాలకు ప్రీమియర్ షో టికెట్లు వెయ్యి రూపాయలకు పైగా విక్రయించిన దాఖలాలు ఉన్నాయి. కానీ 'పెద్ది' చిత్రానికి ప్రభుత్వం అందుబాటు ధరలోనే రూ. 600 నిర్ణయించడం పట్ల మెగా అభిమానులతో పాటు మధ్యతరగతి ప్రేక్షకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కించిన 'పెద్ది' చిత్రం 1980ల కాలం నాటి గ్రామీణ ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో సాగుతుంది. ఒక సాధారణ యువకుడు క్రీడల ద్వారా తన గ్రామాన్ని ఎలా ఏకం చేశాడు.. ఊరి ఆత్మగౌరవాన్ని కాపాడటానికి ఎలా పోరాడాడు అనే ఒక పవర్‌ఫుల్ లైన్‌తో ఈ సినిమా రూపొందింది. ఇందులో కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్.. జగపతి బాబు.. దివ్యేందు శర్మ.. బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా.. రత్నవేలు సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన హైలైట్ కానుంది. ప్రభుత్వ అనుమతులతో సినిమాకు భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయంగా కనిపిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Adya Media Telugu