Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

పెట్రో బాంబు..భారీ షాక్!

త కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు స్థిరంగా పెరుగుతుండటంతో, చమురు సంస్థలు సామాన్యుడిపై భారాన్ని మోపాయి. శుక్రవారం నుంచి లీటర్ పెట్రోల్ మరియు డీజిల్‌పై సగటున రూ.

3 మేర ధర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. అసోం, కేరళ, తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముగిసిన 16 రోజుల తర్వాత ఈ పెంపు చోటుచేసుకోవడం గమనార్హం.

ఇవాళ ఉదయమే పెరిగిన ధరలు అమల్లోకి రాగా హైదరాబాద్ లో రూ. 110.89గా ఉండగా న్యూఢిల్లీలో రూ. 97.77,ముంబైలో రూ. 106.64,కోల్‌కతాలో రూ. 108.74,చెన్నైలో రూ. 103.90గా ఉంది.

డీజిల్ ధరను పరిశీలిస్తే.. హైదరాబాద్ లో రూ. 98.96,న్యూఢిల్లీలో రూ. 90.67 ,ముంబైలో రూ. 93.14 ,చెన్నైలో రూ. 95.47,తిరువనంతపురంలో రూ. 99.63గా ఉంది. అంతర్జాతీయ పరిస్థితులు మరియు ముడి చమురు ధరల ఒడిదుడుకుల వల్ల ధరల సవరణ అనివార్యమైందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఇప్పటికే పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో సతమతమవుతున్న సామాన్యులకు, తాజా ఇంధన ధరల పెంపు మరింత ఇబ్బందికరంగా మారింది. నిత్యావసర వస్తువుల రవాణా ఖర్చులు పెరగడం వల్ల మార్కెట్‌లో కూరగాయలు మరియు ఇతర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Adya Media Telugu