Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ రిలీఫ్.. కీలక నిర్ణయాలు

పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ రిలీఫ్.. కీలక నిర్ణయాలు

పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. కీలక నిర్ణయాలు ప్రకటించింది. ఈపీఎఫ్ఓ ద్వారా ఖాతాదారులకు వడ్డీ జమ, ఆటో క్లెయిమ్ సదుపాయం మరియు కొత్త నిబంధనలను అందుబాటులోకి తెచ్చింది.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఖాతాదారులందరికీ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ 8.25 శాతం వడ్డీని ప్రతి సభ్యుని ఖాతాలో జమ చేయడానికి కేంద్రం అనుమతించింది. ఇందుకు ముహూర్తం ఖరారైంది.

పీఎఫ్ ఖాతాదారులకు వర్తించే వడ్డీ పైన కేంద్రం స్పష్టత ఇచ్చింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతం ఈపీఎఫ్ వడ్డీని జూలై 15 నాటికి దాదాపు 34 కోట్ల ఈపీఎఫ్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించింది. దాదాపుగా రూ 44 కోట్ల మేర వడ్డీ మొత్తం చెల్లించనున్నారు. తాజాగా తీసుకొచ్చిన సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ (సైట్స్) ప్లాట్‌ఫామ్ ద్వారా తొలిసారి వడ్డీ పంపిణీ చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం, సైట్స్ 2.01 పూర్తి అమలు ఈ వారాంతానికి పూర్తవుతుంది. ఆ తర్వాత అన్ని సేవలు అందుబాటులో ఉంటాయి.
అలాగే ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్‌ తెలిపింది. 5 లక్షల రూపాయల వరకు పీఎఫ్‌ ఆటో క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ చేసుకోవచ్చని ప్రకటించింది. దీంతో, పీఎఫ్ క్లెయిమ్‌లు మరింత సులభతరం కానుంది.

ఖాతాలో రూ.5 లక్షల బ్యాలెన్స్ ఉంటే, దాదాపు రూ.40,000 వరకు వార్షిక వడ్డీ లభిస్తుంది. రూ. 5 లక్షల వరకు ఆటో క్లెయిమ్ ఖాతాదారులకు అత్యవసర సమయాల్లో డబ్బులు త్వరగా అందేలా 'ఆటో క్లెయిమ్' సదుపాయం అమల్లోకి వచ్చింది. దీని ద్వారా పీఎఫ్ అడ్వాన్స్ లేదా ఇతర క్లెయిమ్‌లను సులభంగా మరియు వేగంగా పొందవచ్చు. దేశ వ్యాప్తంగా ఏ ఈపీఎఫ్‌వో ఆఫీస్‌ నుంచైనా సేవలు పొందే వెసులుబాటు కలగనుంది. గతంలో వడ్డీ రేటు ప్రకటన తరువాత పీఎఫ్ ఖాతాదారులు మూడు నెలలకు పైగా వేచి ఉండాల్సి వచ్చేది. కాగా, ఇప్పుడు కొత్త విధానం తో వెంటనే ఖాతాల్లో జమ అవుతాయని వెల్లడించారు. ఈ నెల 15వ తేదీ నుంచి వరుసగా ఖాతాదారుల ఖాతాల్లో వడ్డీ జమ కానుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Adya Media Telugu